Jr NTR : బీజేపీ నయా వ్యూహం.. పవన్ చేయి వదిలేస్తే… టైగర్ ను సిద్ధం చేస్తున్నారా..?!

Jr NTR : తెలంగాణలో మునుగోడులో భారీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించింది. అయితే ఆ సభ హాట్ టాపిక్ అవ్వలేదు. స్వయానా హోం మంత్రి అమిత్ షా సభకు హాజరైనా రాజకీయాల్లో నానలేదు. కానీ అంతకు ముందు మన కేంద్ర హోమ్ మంత్రి చేసిన ఒక పని మాత్రం రాజకీయాల్లో చర్చలకు దారితీసింది. అదే నందమూరి చిన్నోడు చిన్న ఎన్టీఆర్ ను కలవడం. ముందుగా అమిత్ షా షెడ్యూల్ లో లేకున్నా చివర్లో షెడ్యూల్ లో మార్పులు చేసి ఎన్టీఆర్ ను విందుకు పిలిచారు అమిత్ షా. ఇక అంతే మొత్తం ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ న్యూస్ అయింది. ఎందుకు ఎన్టీఆర్ ను కలిసాడు అమిత్ షా, బీజేపీ వ్యూహం ఏమిటి అంటూ విశ్లేషణలు బయలుదేరాయి.

పవన్ కు పొగ బెట్టడానికి యంగ్ టైగర్ ను వాడుతున్నారా…

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ నటన ఇరగదీసాడు, ఈ విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక మన కేంద్ర హోమ్ మంత్రికి కూడా ఎన్టీఆర్ నటన బాగా నచ్చిందట అందుకే అయనను ప్రశంసించడానికి ఎన్టీఆర్ ను ఆహ్వానించారు అంటూ పైకి బీజేపీ వాళ్ళు చెబుతున్న మాట. అంతకు ముందు కొమరం భీమ్ పాత్ర ముస్లిం టోపీ పెట్టుకోవడం ఏమిటి సినిమాను థియేటర్లో ఆడనివ్వం అంటూ ఊగిపోయిన బండి సంజయ్ వంటి బడా నేతలే ఇపుడు ఎన్టీఆర్ ను స్వయంగా తీసుకెళ్లడం ఆశ్చర్యకరంగా అనిపించింది. అయినా సినిమా నచ్చితే ఒక్క ఎన్టీఆర్ ను మాత్రమే పిలవాలా, అందులో రామ్ చరణ్ కూడా హీరోనే కదా సూపర్ గా చేసాడు కదా అల్లూరి సీతారామరాజు పాత్ర. మరి రామ్ చరణ్ ను ఎందుకు పిలవలేదు మరీ ముఖ్యంగా సినిమాకు మెయిన్ కారకుడైనా దర్శకుడు రాజమౌళి ని పిలవలేదు. పోనీ రాజమౌళి కి బీజేపీతో సత్సంబందాలు ఉన్నాయి, వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ కి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. మరి రాజమౌళి ఎందుకు కనిపించలేదో బీజేపీ కి అనే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే ఇపుడు బలంగా వినిపిస్తున్న విశ్లేషణ పవన్ కి బీజేపీ చెక్ పెట్టడానికి ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతున్నారు అని. అయితే ఇందులో ఎంత నిజముందో కానీ పవన్ ఇప్పటివరకు అయితే బీజేపీ రోడ్డు మ్యాప్ లోనే ఉన్నాడు, కాకపోతే ఎప్పుడైనా పవన్ హ్యాండ్ ఇస్తే ఏపీ లో బీజేపీ కి ఒక ఆయుధం కావాలి కదా అందుకోసం ఎన్టీఆర్. అయితే ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. ఎన్టీఆర్ ను రామోజీ రావు ను కలవడంలో చంద్ర బాబు నాయుడుకి మోడీ ఇన్ని రోజుల తరువాత అపాయింట్మెంట్ ఇవ్వడానికి కారణం సీమాంధ్రులకు ప్రాధాన్యం ఇస్తున్నానము అంటూ తెలంగాణ, కర్ణాటకలోని సెటిలర్స్ అయిన సీమాంధ్రులకు చెప్పడమే అంటూ మరో వాదన ఉంది. అయితే ఎన్టీఆర్ ను ఎందుకు కలిసింది బీజేపీ వర్గాలు చెప్పకపోయినా బీజేపీ ఏదో చేస్తోంది అనే సాంకేతాలు మాత్రం ప్రజల్లోకి వెళ్లేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. నిజంగా బీజేపీ వాళ్ళు చెబుతున్నట్లు ఎన్టీఆర్ ను రాజకీయ లబ్ది లేకుండా మెచ్చుకోవడం కోసం పిలిచినా ఏదో వ్యూహం ఉంది అని ప్రత్యర్థులు అనుకునేలా చేసేసారు బీజేపీ వాళ్ళు. ఇక ఎన్టీఆర్ విషయానికోస్తే ఇప్పట్లో ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావడం కష్టమే. అదీకాక అభిమానులయితే ఇపుడే నీకు రాజకీయాలు వద్దు అన్న సలహా ఇస్తున్నారు. మరి నిజంగా బీజేపీ పవన్ కి ఆల్టర్నేటివ్ గా చిన్న ఎన్టీఆర్ ను దింపుతోందో లేదో బీజేపీ వాళ్ళు బయటపడే వరకు తెలియదు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago