Akkineni Nageswarrao : ఏఎన్ఆర్ తెలుగు సినిమాకు మూలస్థంబాల్లో ఒకరు. ఇండస్ట్రీ కి రెండు కళ్లుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ను వర్ణిస్తారు. నాగేశ్వర రావు గారు తెలుగు ఇండస్ట్రీ లో నవలా నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. సాంఘిక, కుటుంబ చిత్రాలకు పెట్టింది పేరు. అయన భక్తిడిగా విప్రనారాయణ, పాండురంగడు వంటి సినిమాల్లో నటనకు జీవం పోశారు. ఇక దేవదాసు సినిమా అయన కెరీర్ లోనే ఒక మైలురాయి. దేవదాసు బెంగాలీ నవల, చాలా భాషల్లో సినిమా వచ్చినా నాగేశ్వరావు గారు దేవదాసులా ఒదిగిపోయినంత ఇంకెవరు చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. దాదాపు డెబ్భై ఏళ్ల సినిమా ప్రస్థానంలో ఎన్నో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇక అలాంటి నాగేశ్వర రావు గారు అసలు ఇండస్ట్రీ కి ఎలా వచ్చారో తెలుసా…
ఘంటసాల బలరామయ్య గారు లేకుంటే ఈరోజు తెలుగు సినిమాకు ఏఎన్ఆర్ లేడు…
నాగేశ్వర రావు గారు పుట్టింది దిగువ మధ్య తరగతి కుటుంబంలో, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి పిల్లలను చదివించే స్థోమత నాగేశ్వరరావు గారి తల్లిదండ్రులకు లేదు. అందుకే అయన ఎలిమెంటరీ చదువు వద్ద ఆగిపోయి నాటకాలను వేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డారు. అయన ఒక నాటకానికి 5 రూపాయలు అప్పట్లో సంపాదించేవారు. నెలకు నాలుగు నాటకాలు ఉండేవి. ఇక నాటకాల్లో ఆయన ఎక్కువగా ఆడపిల్ల వేషాలు వేశారు. అలా ఒకరోజు బెజవాడ లో నాటకం ముగించుకుని సొంతూరు గుడివాడ వెళ్ళడానికి రైలులో ఎక్కగా బెజవాడ, గుడివాడలో తమ నెక్స్ట్ సినిమా కు సరిపోయే కుర్రాళ్ల కోసం వెతుకుతున్న ఘంటసాల బలరామయ్య గారు చూసి సినిమాల్లో ఆసక్తి ఉందా వేషం వేస్తావా అని అడిగారు.
నాగేశ్వరావు గారి కంటే పొడుగ్గా ఉండే అబ్బాయి దొరికితే లక్ష్మణుడి వేషం, నాగేశ్వరరావు కంటే పొట్టి వాడు దొరికితే నాగేశ్వరరావు గారికి రాముడి వేషం వేయించాలని అనుకున్నారట. అయితే నాటకాల కంపెనీ వాళ్ళు సినిమా కోసం మద్రాస్ వెళితే నాటకాల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే నాగేశ్వరరావు గారి గాడ్ ఫాదర్ లాంటి మధుసూదనరావు గారు నెలలో 10 రోజులు నాటకాలకు, మిగిలిన రోజులు సినిమాలకు కేటాయించే విధంగా ఒక అగ్రిమెంట్ తయారు చేయించి మద్రాస్ కి పంపారు. అలా బలరామయ్య గారి కంట పడటం వల్ల నాగేశ్వరరావు గారు సినిమాల్లోకి వచ్చారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు నాగేశ్వరరావు గారు గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…