Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారసుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి పరిచయం అవసరం లేదు. బాల నటుడిగా సందడి చేసి అనంతరం నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేదు.
ఈ సినిమా అనంతరం ఈయన నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఎన్టీఆర్ కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు.
ఇకపోతే ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించడం విశేషం. తాజాగా ఈయన ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అశ్వినీ దత్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా గురించి అలాగే ఎన్టీఆర్ సక్సెస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక స్టార్ హీరోగా ఈ స్థానంలో ఉన్నారంటే అందుకు కారణం తన తండ్రి హరికృష్ణ అని ఈయన షాకింగ్ కామెంట్ చేశారు.
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేయాలనుకున్నప్పుడు ముందుగా ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ ని అనుకున్నాము. అయితే ఈ సినిమా విషయం తెలిసిన హరికృష్ణ వెంటనే తనకు ఫోన్ చేసి ఈ సినిమాలో ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోవాలని సూచించారట. హరికృష్ణ అంతటి వారు ఫోన్ చేయడంతో అశ్వినీ దత్ కాదనలేక ప్రభాస్ నటించాల్సిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని ఎన్టీఆర్ తో చేయించారు. కట్ చేస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.
నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా వచ్చినప్పటికీ తన కెరియర్ మాత్రం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తోనే మొదలైందని చెప్పాలి. ఈ సినిమా విషయంలోనే కాకుండా ఎన్టీఆర్ సక్సెస్ లో హరికృష్ణ చాలా భాగమయ్యారని అయితే నేడు ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉండటం చూడడానికి హరికృష్ణ మన మధ్య లేరు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ సక్సెస్ వెనక తన తండ్రి హస్తం ఎంతో ఉంది అంటూ నిర్మాత అశ్వినీ దత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…