NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతూ షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
హరికృష్ణ వారసుడు అయినప్పటికీ నందమూరి ఫ్యామిలీ ఈయన రెండో సంతానానికి పుట్టిన బిడ్డ అని చెప్పి ఆ కుటుంబానికి దూరం చేశారు చిన్నప్పటినుంచి తల్లివద్దే పెరిగిన ఎన్టీఆర్ ఇప్పటికి నందమూరి ఫ్యామిలీకి దగ్గర కాలేకపోతున్నారని చెప్పాలి. అయితే గతంలో తన తాతయ్య చెప్పిన మాటలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఒకరోజు తాతగారు నన్ను అమ్మను తన వద్దకు రమ్మన్నారు అక్కడికి వెళ్ళగా ఆయన మాట్లాడుతూ..ఇంతకాలం దూరంగా ఉన్నాము.. దాని గురించి పట్టించుకోకండి. నా వంశోధారకుడు నీ కడుపున పుట్టాడు. నా అంతటివాడిగా తీర్చిదిద్దడంలో నీవంతు బాధ్యత నువ్వు నిర్వర్తించు.. నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అన్నారు. ఆ తర్వాత చనిపోయారు. నాకు కోపం వచ్చింది. ఈయనేంటి ఇంత మాట అన్నాడు.. నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని చెప్పి మళ్ళీ ఒంటరిని చేసి వెళ్లిపోయారు అని చాలా బాధపడ్డాను.
నా బాధ్యత నెరవేరుస్తున్న..
ఇక తాతగారు చనిపోయిన తర్వాత నాకు ఆయన ఆరోజు ఎందుకు అలా అన్నారో తెలిసి వచ్చింది. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలను తన రూపురేఖలను నాకు ఇచ్చి వెళ్లారు.అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఆయన ఆశీర్వాదం.. ఆయన వంతు బాధ్యత ఆయన నిర్వర్తించారు. మా అమ్మ వంతు బాధ్యత అమ్మ నిర్వర్తించింది. ఇప్పుడు నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను అంటూ తన తాతయ్య గురించి ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…