Jr.NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఈయన అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా మారిపోయారు.
ఇక సినిమాల పరంగా ఎన్టీఆర్ ఎంతో మంచి సక్సెస్ సాధించే వృత్తిపరమైన జీవితంలో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా గడుపుతున్నారు.ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పేరు అభయ్ రామ్, చిన్న కుమారుడు పేరు భార్గవ్ రామ్.
సాధారణంగా హీరోలు అందరూ కూడా వారి పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ మాత్రం కాస్త భిన్నం అని చెప్పాలి. తన భార్య పిల్లలను ఈయన సోషల్ మీడియాకు పూర్తిగా దూరం ఉంచారు. ఇక ప్రణతి సైతం ఏదైనా కార్యక్రమాలలో పాల్గొన్న ఈమె మీడియాతో మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడరు.ఇక సాధారణంగా ఎన్టీఆర్ కుమారుల ఫోటోలు సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనబడుతుంటాయి. తాజాగా ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చేతిలో పెయింటింగ్ వేసిన ఫోటోని పట్టుకొని ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటో చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భార్గవ్ రామ్ చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ముందు బాబుకి దిష్టి తీయండి అంటూ మరికొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…