Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. గత ఏడాది సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు తన 29వ చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారు.రాజమౌళి సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే ఈయన ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బాహుబలి సినిమాను రెండు పార్టలు చిత్రీకరించి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అనంతరం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం. ఇలా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి తదుపరి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ క్రమంలోనే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు పార్టులుగా రాబోతుందని సమాచారం. . అత్యంత భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ మూవీగా చేయాలనే ఆలోచనలు రాజమౌళి ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే మహేష్ బాబు ఇతర దర్శకులకు అవకాశం ఇవ్వకుండా 10 సంవత్సరాలు పాటు రాజమౌళికి మాత్రమే అంకితం అవుతారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…