Uttej: ఎన్నో తెలుగు సినిమాలలో నటుడిగా కామెడీయన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఉత్తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నటువంటి ఉత్తేజ్ సోషల్ మీడియా వేదికగా తాజాగా తన భార్య పద్మను తలుచుకొని ఎమోషనల్ లెటర్ రాశారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తేజ్ భార్య పద్మని సెప్టెంబర్ 13 2021 వ సంవత్సరంలో క్యాన్సర్ తో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే. బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈమె మరణించారు.ఇకపోతే ఏప్రిల్ 8వ తేదీ ఉద్దేశ్ పద్మల వివాహ దినోత్సవం కావడంతో ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఉత్తేజ్ ఎంతో ఎమోషనల్ అవుతూ తన భార్య పై ఉన్న తన ప్రేమను చూపెడుతూ రాసినటువంటి లెటర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా ఉత్తేజ్ తన భార్య గురించి రాస్తూ పద్దు పెళ్లిరోజు శుభాకాంక్షలు..మనకు నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. ఎక్కడ ఉన్నావ్ ఎలా ఉన్నావ్ నువ్వు నేను మనం ఆయన ఈ పెళ్లి రోజున కుటుంబ వ్యవస్థకు నాందీ వాచకం పలికిన రోజు. పద్దూ.. !! పెళ్లి కి ముందు, మా నాన్నకి ఉత్తరం రాసావు, మీ అబ్బాయి నేను ఇష్టపడుతున్నాం. మీరు సమ్మతిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని రాశావు అందుకు మా నాన్న కూడా ఒప్పుకున్నారు.
ఇలా ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో థియేటర్ ని గుడిగా మార్చుకొని మన పెళ్లి చేసుకున్నాం. ఇలా పెళ్లి బంధంతో నాలో సగం వచ్చి నాలవ్ సగమై నాతో నడుస్తూ ఎటు వెళ్లిపోయావు నువ్వు తిరిగిరాని ఈ లోకం కోసం తిరిగి తిరిగి చూస్తూన్న పద్దు లవ్ యు పద్దమ్మ అంటూ ఈ సందర్భంగా ఉత్తేజ్ తన పెళ్లి రోజున తన భార్యను తలుచుకుంటూ రాసినటువంటి ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…