Jr.NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటనలోనే కాకుండా తన వస్త్రధారణ విషయంలో కూడా అభిమానులను ఎప్పటికప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎన్టీఆర్ వేసే డ్రెస్సింగ్ కి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
ఇక తాజాగా ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలలో భాగంగా స్పెషల్ డిజైనర్ సూట్ లో సందడి చేశారు. ఈ వేడుక కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో వారు నటించిన పాత్రలకు అనుగుణంగా దుస్తులను డిజైన్ చేశారు.ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో పులి తనపై దూకుతూ ఉన్నటువంటి సన్నివేశానికి అనుగుణంగా తన చేతిపై కూడా అలాంటి పులిబొమ్మ ఉన్నటువంటి సూట్ ను స్పెషల్ గా డిజైన్ చేశారు.
ఇక ఎన్టీఆర్ ధరించిన ఈ డ్రెస్ క్షణంలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ డ్రెస్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ మన భారతదేశానికి చిహ్నంగా ఈ డ్రెస్సును ధరించానని కూడా తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ డ్రెస్ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ డ్రెస్ గురించి చర్చలు జరుపుతున్నారు.
ఆస్కార్ వంటి ఒక గొప్ప వేడుకకు హాజరయ్యే ముందు ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఎన్టీఆర్ ధరించిన డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఇప్పుడు మాత్రం అచ్చం అలాంటి డ్రెస్ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ధరించడంతో డ్రెస్ డిజైన్ చేయించేటప్పుడు ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా అన్న అసలే ఆస్కార్ వేడుకలు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు అసలు ఇది మ్యాటరే కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…