Nagachaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. ఈయన హిట్టు ఫ్లాపాలతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇలా తాజాగా నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఇలా మొదటిసారి ఈయన తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా మే 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇక నాగచైతన్య కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే… నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇలా వీరిద్దరు పెళ్లి తర్వాత నటుడు మురళీమోహన్ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే కాపురం ఉన్నారు. అయితే ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా విడాకులతో విడిపోయిన తర్వాత సమంతకు ఆ ఇంటిని వదిలిపెట్టి నాగచైతన్య నాగార్జున ఇంటికి వచ్చారు. ఇలా తన తండ్రి ఇంట్లోనే ఉంటున్నటువంటి నాగచైతన్య తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలని భావించారు.
ఈ క్రమంలోనే నాగర్జున ఇంటికి సమీపంలోనే ఈయన తన అభిరుచులకు అనుగుణంగా సూపర్ లగ్జరీ డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నట్టు తెలుస్తుంది. అన్ని సౌకర్యాలతో నిర్మించుకున్న ఈ ఇంట్లోకి నాగచైతన్య అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఈయన ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…