జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే RRR తర్వాత తారక్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే దానిపై చాలా కన్ఫ్యూషన్ నెలకొంది.. అయితే తాజాగా ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చేసింది..ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కాదని తేలిపోయింది. త్రివిక్రమ్ స్థానంలోకి కొరటాల శివ వచ్చాడు. ఎన్టీఆర్ 30వ సినిమా ‘జనతా గ్యారేజ్’ కాంబినేషన్లో రాబోతున్నట్లు అధికారికంగా స్పష్టమైంది. కొరటాల మిత్రుడైన మిక్కిలేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రధాన పెట్టుబడిదారు ఆయనే కానీ.. ఈ ప్రాజెక్టులో మరో నిర్మాణ భాగస్వామి కూడా ఉన్నారు. ఆయనే ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్.
హారిక హాసిని సంస్థ భాగస్వామ్యంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మించాల్సింది. అందులో అతను చిన్న వాటాదారు. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది.త్రివిక్రమ్‌తో పాటు హారిక హాసిని అధితేన చినబాబు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ప్రధాన పెట్టుబడిదారుగా మిక్కిలినేని సుధాకర్ వచ్చారు కానీ.. కళ్యాణ్ రామ్ స్థానం మాత్రం మారలేదు.ఇంతకుముందు ‘జై లవకుశ’ సినిమా చేసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌కు మంచి లాభాలు అందించాడు తారక్. అంతటితో ఆగకుండా అన్నయ్యకు మరో సినిమా చేయాలనుకుని త్రివిక్రమ్ చిత్రానికి నిర్మాణ భాగస్వామిని చేశాడు. దర్శకుడు, ప్రధాన నిర్మాత మారినా.. తన 30వ సినిమాలో కళ్యాణ్ రామ్‌ను అలాగే కొనసాగించాడు తారక్.
కాగా త్రివిక్రమ్‌తో అనుకున్న సినిమాకు కళ్యాణ్ రామ్ ప్రి ప్రొడక్షన్ వర్క్ కోసమని కోటి రూపాయలు ఏఢాది కిందటే ఇచ్చాడట.ఇప్పుడు ఆ సబ్జెక్ట్ క్యాన్సిల్ అవడంతో కళ్యాణ్ రామ్‌కు వడ్డీతో సహా హారిక హాసిన సంస్థ నుంచి డబ్బులు ఇప్పించేస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ విషయంలో చిన్న గ్యాప్ తలెత్తిందని.. అందువల్ల తారక్‌తో మళ్లీ త్రివిక్రమ్, చినబాబు సినిమా చేయాలనుకున్నపుడు అందులో కళ్యాణ్ రామ్ జోక్యం ఉండకపోవచ్చని అంటున్నారు…!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…