దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.. కానీ తాజాగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతోంది.. దీనికి సంబంధించి నిన్న కొరటాల తన ట్విట్టర్ వేదికగా అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ బిగ్ ఎనౌన్స్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పై తాజాగా ఒక ఇంట్రస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో తారక్ కి హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ ఫస్ట్ చాయిస్ కియారా అద్వానీనే అని, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసినప్పుడు కూడా హీరోయిన్ గా తారక్, కియారా వైపే మొగ్గు చూపాడని వార్తలు వచ్చాయి. అయితే కియరా అద్వానీ, తారక్ సినిమాలో ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కియారాని తెలుగులో తీసుకువచ్చింది కొరటాలనే. ‘భరత్ అనే నేను’ అనే సినిమాతో కియరాకి మంచి బ్రేక్ ఇచ్చాడు కొరటాల. అందువల్ల కొరటాల డేట్స్ అడిగితే.. ఇప్పుడు కియారా ఓకే అనడం ఖాయం. పైగా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కియారాకి ఈ సినిమా పట్ల ఆసక్తి ఉండే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.
మరి ప్రస్తుతం నడుస్తోన్న కరోనా సెకెండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకునే మేకర్స్ ఈ సినిమాని ప్రకటించారట. అలాగే ‘లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ కొరటాల పోస్ట్ చేసిన మెసేజ్ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెబుతుంది. ఇక ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమా కూడా ఓ సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం…!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…