బాహుబలి సీరీస్ తో దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ప్రస్తుతం ఎన్టీఆర్ చరణ్ లతో RRR అనే ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా నటిస్తోంది. అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
అక్టోబర్ 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీపై ఆసక్తి పెంచేందుకు ఒక్కో అప్‌డేట్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్ . ఈ రోజు ఉగాది సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేశారు.ఇందులో ఇద్దరు హీరోలు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది..గతంలో ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ విషయంలో వెనకబడ్డ జక్కన్న.. ఇప్పుడు మాత్రం వరుస అప్డేట్ లతో సర్ప్రైజ్ చేస్తున్నాడు..
ఇక తాజా పోస్టర్ లో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరినీ కలిపి చూపించారు.. దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు రెట్టింపు అయ్యాయి..ఆక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఎన్టీఆర్ తో అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశాడట రాజమౌళి.. సినిమాలో ఓ ఫైట్ సీన్ ఓ విజువల్ వండర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. శ్రీయా శరణ్, రాహుల్ రామకృష్ణ, సముద్ర ఖని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు…!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…