Midhun Reddy lying on the floor.. Judge is serious about the behavior of the prison staff!
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం ఆయనను జైలుకు తరలించారు. అయితే జైలులో మిథున్ రెడ్డికి సరైన వసతులు కల్పించకపోవడంపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది.
కోర్టు స్పష్టంగా ఆయనకు మంచం వంటి అవసరమైన వసతులు కల్పించాలంటూ జైలు అధికారులను ఆదేశించినప్పటికీ, వారు ఆ ఆదేశాలను పాటించలేదని వాదనలు వినిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి రాత్రి కటిక నేలపై నిద్రపోయారంటూ ఆయన న్యాయవాది కోర్టుకు నివేదించారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై న్యాయవ్యవస్థలోనూ స్పందన వచ్చింది. జైలు సిబ్బంది ప్రవర్తనపై జస్టిస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తదనుగుణంగా మంగళవారం జైలు అధికారిని కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం వ్యవహారంపై వైసీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మన వంటింట్లో సాధారణంగా ఉపయోగించే కూరగాయల్లో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. అయితే వాటిలోని కొన్ని భాగాలను మనం పట్టించుకోకుండా…
ఉదయం అలారం మోగగానే లేవాలనిపించక, “ఇంకా ఐదు నిమిషాలు పడుకుందాం” అనిపించడం చాలా మందికి సాధారణ అనుభవం. రాత్రంతా సరిపడా…
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన ట్రెండ్లు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా Instagram వంటి వేదికల్లో “డిటాక్స్ డ్రింక్స్”…
వంటింట్లో నూనె ఎంపిక చిన్న విషయం కాదు. మనం ఏ నూనెతో వంట చేస్తున్నామన్నది ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది.…
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…