రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం ఆయనను జైలుకు తరలించారు. అయితే జైలులో మిథున్ రెడ్డికి సరైన వసతులు కల్పించకపోవడంపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది.

కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై ఆగ్రహం
కోర్టు స్పష్టంగా ఆయనకు మంచం వంటి అవసరమైన వసతులు కల్పించాలంటూ జైలు అధికారులను ఆదేశించినప్పటికీ, వారు ఆ ఆదేశాలను పాటించలేదని వాదనలు వినిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి రాత్రి కటిక నేలపై నిద్రపోయారంటూ ఆయన న్యాయవాది కోర్టుకు నివేదించారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
జైలు అధికారికి సమన్లు
ఈ ఘటనపై న్యాయవ్యవస్థలోనూ స్పందన వచ్చింది. జైలు సిబ్బంది ప్రవర్తనపై జస్టిస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తదనుగుణంగా మంగళవారం జైలు అధికారిని కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం వ్యవహారంపై వైసీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


































