Jyothi Rai: జ్యోతి రాయ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు జగతి అంటే మాత్రం అందరికీ ఈమె టక్కను గుర్తు వస్తారు. గుప్పెడంత మనసు సీరియల్ లో ఈమె జగతి పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు. ఎంతో అద్భుతంగా చీర కడుతూ పెద్ద బొట్టు పెట్టుకొని ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే సీరియల్లో చాలా పద్ధతిగా ఉన్నటువంటి ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చి మరొక డైరెక్టర్ ప్రేమలో మునిగి తేలుతున్నారు.
ఈ క్రమంలోనే జ్యోతి అలియాస్ జగతి 20 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈమె తనకన్నా వయసులో చిన్నవాడు అయినటువంటి సుఖ పూర్వజ్ అనే డైరెక్టర్ తో ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ చాలా క్లోజ్ గా తీసుకున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బహుశా రిలేషన్ లో ఉన్నారా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి.
ఇకపోతే తాజాగా జ్యోతి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. ఇందులో భాగంగా ఈమె ఏకంగా తన పేరును మార్చి పెట్టడంతో ఈమె డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నారని అందరూ ఫిక్స్ అయ్యారు.సాధారణంగా పెళ్లికి ముందు తండ్రి పేరును తమ పేరు పక్కన పెట్టుకుంటారు. పెళ్లి తర్వాత తమ భర్త పేరును తమ పేరు పక్కన పెట్టుకోవడం సహజం కానీ ఈమె ట్విట్టర్ ఖాతాలో మాత్రం తన పేరు పక్కన తన ప్రియుడు పూర్వజ్ పేరును జోడించారు.
ఈ క్రమంలోనే ట్విట్టర్ ఖాతాకు జ్యోతి పూర్వజ్ అనే పేరుతో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడంతో బహుశా ఈమె డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నారా అందుకే ఇలా తన పేరు కూడా మార్చుకున్నారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఏది ఏమైనా సీరియల్లో ఎంతో పద్ధతిగా జగతిని చూసి ఆమె గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో చూడటంతో ఒక్కసారిగా అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…