K. Viswanath: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా వారసత్వం కొనసాగడం సర్వసాధారణం అయితే ఇండస్ట్రీలో ఈ వారసత్వం మరికాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి.ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీల పిల్లలు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కే విశ్వనాథ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకులు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈయనకు ముగ్గురు వారసులు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నప్పటికీ ఈయన ముగ్గురు పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. ఈ విధంగా విశ్వనాథ్ వారసులు ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి గల కారణాలను ఈయన గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.
ఈ క్రమంలోనే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విశ్వనాథ్ గారికి ఇదే ప్రశ్న ఎదురయింది.మీ పిల్లలను ఎందుకు ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు అనే ప్రశ్న ఎదురవడంతో ఈ ప్రశ్నకు విశ్వనాథ్ గారు సమాధానం చెబుతూ ఇండస్ట్రీలో నేను సక్సెస్ అయిన విధంగా తన పిల్లలు సక్సెస్ అవుతారనే నమ్మకం నాకు లేదు అందుకే వారిని బాగా చదివించి ఇతర రంగాలలో స్థిరపడేలా చేశానని తెలిపారు.
నా పిల్లలను ఇండస్ట్రీలోకి రావాలని నేను ఎప్పుడు ప్రోత్సహించలేదని అయితే ఇక్కడ నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమని తెలిపారు. మా రోజుల్లో పరిస్థితులు వేరేగా ఉండేది. అప్పుడు ప్రతిభను గుర్తించే మనుషులు చాలా మంది ఉండేవారు. డబ్బుల విషయంలోనూ.. పేరు ప్రఖ్యాతల విషయంలోనూ ఇక్కడో అనిశ్చితి ఉంది. అందుకే మా పిల్లల్నివేరే రంగాల్లో స్థిరపడేలా చేశాను ఇక తన పిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా గౌరవం మర్యాదలన్నీ వాళ్లకు చెందాలని లేదు ఇక్కడ ఎవరి టాలెంట్ వాళ్లే ప్రూఫ్ చేసుకోవాలి. నా పిల్లలు డైరెక్టర్లు కావాలని నేను నా సొంత డబ్బుతో సినిమాలు చేయలేను కదా..ప్రస్తుతం మా పిల్లలు ఫలానా కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్నారని తాను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను అంటూ గతంలో ఈయన తన వారసుల ఎంట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…