Movie News

K. Viswanath: చివరి క్షణాల వరకు కళామతల్లి ఒడిలోనే గడిపిన విశ్వనాథ్… ఆయన మరణించే క్షణాల ముందు ఏం జరిగిందో తెలుసా?

K. Viswanath: గత కొన్ని నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఐదు నెలలలో ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు దిగ్గజ నటీనటులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. గతవారం లెజెండరీ యాక్టర్స్ జమున మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె మరణ వార్త నుంచి బయటపడక ముందే టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ గారు కన్నుమూశారు.

ఈయన గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆఖరి శ్వాస వదిలారు. అయితే ఈయన చనిపోయే క్షణాల ముందు వరకు కూడా కళామతల్లికి సేవలు చేస్తూ కన్నుమూశారు.గురువారం రాత్రి ఈయన పాటలు రాస్తూ ఉన్నారు. అయితే ఉన్నఫలంగా ఈయనకు అనారోగ్యం చేయడంతో ఆ పాటను పూర్తి చేయమని తన కొడుకుకు చెప్పారు. ఇలా తన కుమారుడు పాట పూర్తి చేస్తుండగానే ఈయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఇలా విశ్వనాధ్ గారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.ఇలా ఐదు దశాబ్దాలుగా తెలుగు కళామతల్లికి సేవలు అందించిన విశ్వనాథ్ గారు చివరి క్షణాలలో కూడా కళామతల్లికి సేవలు చేస్తూనే తుది శ్వాస విడిచారు.

K. Viswanath: బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు..

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విశ్వనాధ్ గారి మరణ వార్త తెలియగానే సినీ ప్రముఖులందరూ తరలివచ్చి ఈయనకు నివాళులు అర్పించారు. ఇక నేడు హైదరాబాద్ పంజాగుట్టలోని స్మశాన వాటికలో ఈయన అంత్యక్రియలను బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం నిర్వహించారు. ఈయన అంత్యక్రియలలో సినీ సెలబ్రిటీలపాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

21 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

22 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago