Featured

Kadhambhari Kiran : రాజేంద్ర ప్రసాద్ కోసం అంత చేస్తే చివరికి అలా చేసాడు… చిరంజీవి వద్ద నన్ను బ్యాడ్ చేసారు : కాదంబరి కిరణ్

Kadhambhari Kiran : తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక డైరెక్టర్ గా సీరియల్ ప్రొడ్యూసర్ గా అందరికి సుపరిచితుడైన కాదంబరి కిరణ్ తన సినిమా చేదు అనుభవాలతో పుస్తకాన్ని కూడా రాస్తున్నానని చెప్పారు. కిరణ్ మొదట జర్నలిస్ట్ గా ఈనాడు లో పనిచేస్తూ ఉన్నపుడే సీరియల్స్ లో నటించారు. ఇక చాలా సీరియల్స్ ప్రొడ్యూసర్ గా ఉండి చాలా డబ్బు నష్టపోయినట్లు చెప్పారు కిరణ్. ఇక ఏఎన్ఆర్ గారితో మంచి అనుబంధం కలిగి ఉన్న కాదంబరి గారు ఇండస్ట్రీ లో తాను ఎదగకపోడానికి కారణాలను తాజా ఇంటర్వ్యూ లో వివరించారు. నాగార్జున గారితో ఒక పల్లెటూరి నేపథ్యంలో సినిమా చేయాలని భావించినా ఆది కుదరలేదని నన్ను అక్కినేని కుటుంబానికి కొంతమంది పనిగట్టుకుని దూరం చేసారాంటూ చెప్పారు.

రాజేంద్ర ప్రసాద్ కు అంత చేస్తే చివరికి…

సినిమాల్లో మొదటి నుండి రాజేంద్ర ప్రసాద్ నాకు మంచి స్నేహితుడు అంటూ చెప్పారు. ఒరేయ్ అనుకునేంత క్లోజ్ ఫ్రెండ్స్ మేమిద్దరం, ఇప్పటికీ కలిసే ఉన్నాం అంటూ కిరణ్ చెప్పారు. మా అసోసియేషన్ ఎన్నికలప్పుడు కొంత గ్యాప్ వచ్చింది. మా ఎలక్షన్స్ అపుడు రాజేంద్ర ప్రసాద్ ను ప్రెసిడెంట్ గా గెలిపించుకున్నాం అక్కడ వెనుక ఉండి కష్టపడ్డాము. అయితే గెలిచాక గెలిపించిన వాళ్లను మర్చిపోయి నేనే గెలిపించాను అనుకున్నపుడే ఎవరికైనా పతనం మొదలవుతుంది రాజేంద్ర ప్రసాద్ గెలిచాక మమ్మల్ని పక్కన పెట్టాడు.

తనని గెలిపించడం కోసం నేను ఎదుటివాళ్లతో బ్యాడ్ అయ్యాను అంటూ చెప్పారు. చిరంజీవితో నేను ఎపుడు క్లోజ్ గా లేను కేవలం అయన సినిమాలో ఒకదానిలో నటించాను. కానీ అయనకు ఒకసారి చెప్పాను మీరు నడిచేటపుడు వెనుక లేచే దుమ్ములో ఒక రేణువు నేను అన్నయ్య అని, అయితే ఆయన అలా అనొద్దు నువ్వు ఎంతో సోషల్ సర్వీస్ చేస్తున్నావ్ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అంటూ చెప్పారు. కానీ నిజాన్ని ఒప్పుకోవాలి అంటూ చెప్తూ చిరంజీవి గారికి నేను ఎక్కడ దగ్గరైపోతానో, మా ఎన్నికల్లో ఎక్కడ గెలిచేస్తానో అన్న భయంతో కొంతమంది నన్ను చిరంజీవి గారికి దూరం చేసారు. కానీ ఈ విషయం నాకు కూడా మొదట్లో తెలియదు అంటూ కిరణ్ చెప్పారు.

Bhargavi

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

4 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

4 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

4 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

4 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

7 hours ago