Allu Arjun: టాలివుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్. ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది సినీ ప్రముఖులు ,రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
మరోక వైపు ప్రేక్షకులు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ పోస్ట్ షేర్ చేశాడు. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమంలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటించిన అవార్డు దక్కింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ రెండవసారి ఇలా బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకోవటం చాలా సంతోషంగా ఉంది అంటూ అవార్డు ఫంక్షన్ కి సంబంధించిన ఫోటో ని షేర్ చేశాడు.
ఈ విధంగా అల్లు అర్జున్ ప్రవర్తన పట్ల నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కృష్ణంరాజు వంటి గొప్ప నటుడు మరణించడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అల్లు అర్జున్ మాత్రం ఆయన మృతి పట్ల సంతాపం తెలపకుండా అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉందని పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ పోస్ట్ చేసిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా కృష్ణంరాజు మృతి పట్ల అల్లు అర్జున్ సంతాపం తెలుపలేదు.
రెబల్ స్టార్ అభిమానులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొంతమంది నెటిజన్స్ ఏకంగా అల్లు అర్జున్ కి కొంచమైనా బుద్ధి ఉందా? అంటూ బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తన ప్రవర్తనతో అల్లు అర్జున్ తన అభిమానుల నుండి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే చివరికి ఈయన ట్వీట్ డిలీట్ చేయడమే కాకుండా కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…