తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ మంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ప్రస్తుతం కైకాల సృహలోనే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.ఆయనకు చికిత్స అందిస్తున్నామని అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండటం వల్ల అతనికి ఐసియులోని వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
కైకాల సత్యనారాయణ గారికి బీపీ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోవటం వల్ల వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. గత కొద్ది రోజుల క్రితం తన ఇంటిలో జారిపడినప్పటినుంచి ఈయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఇతనికి అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యబృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా అతను కోలుకొని క్షేమంగా బయటకు రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…