బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా రవి ఇతర కంటెస్టెంట్ లకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రవి తన అద్భుతమైన ఆట తీరుతో విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొదటి నుంచి ప్రతి వారం రవి నామినేషన్ లో ఉంటూ ఆ టెన్షన్ ని తట్టుకొనీ టాస్క్ లలో తన అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు బయట నుంచి ఎంతో మంది మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మరొక కంటెస్టెంట్ అభిమానులు ఇతర కంటెస్టెంట్ లను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సర్వసాధారణం. అయితే రవి విషయంలో మాత్రం కేవలం రవిని మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే ఈ విషయంపై రవి భార్య నిత్య స్పందిస్తూ సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తూ తమని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారంటూ తన సన్నిహితుల దగ్గర బాధ పడినట్లు తెలుస్తోంది. మామూలుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్ లు ముందుగానే ఒక పిఆర్ టీమ్ ను పెట్టుకొని వారి గురించి ప్రమోషన్ చేయమని చెబుతారు.
ఈ క్రమంలోనే వారిని హైలెట్ చేయడం కోసం ఇలా పక్కవారి గురించి నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు. ఏదిఏమైనా రవి విషయంలో ఇలా జరగడం బాధగా ఉందని తన భార్య నిత్య తన సన్నిహితుల దగ్గర బాధ పడినట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదటినుంచి రవి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడంతో ఇతను కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారని భావిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…