Movie News

Kajal Aggarwal: నా బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్ది వారందరి నోర్లు మూయిస్తాను: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన కాజల్ అగర్వాల్ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకొని అక్కడ కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో కాలం హీరోయిన్ గా కొనసాగిన కాజల్ లాక్ డౌన్ సమయంలో గౌతం కిచ్లు అనే తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బాబుకు జన్మనిచ్చిన కొన్ని నెలలకే కాజల్ మళ్ళీ ఇండస్ట్రీలో రీయంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యింది. ఆ సమయంలో ఆమె గురించి అనేక విమర్శలు వినిపించాయి. అయితే ఇటీవల ఒక భేటీలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన పై వచ్చిన విమర్శల గురించి స్పందించింది.

ఈ క్రమంలో కాజల్ మాట్లాడుతూ.. “ప్రెగ్నెన్సీ సమయంలో తాను లావయ్యానని కొందరు విమర్శించారని చెప్పుకొచ్చింది. అయితే ఆ సమయంలో నేను ఆ విమర్శలు గురించి పట్టించుకోలేదు అంటూ తెలిపింది. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కొంతకాలానికే నేను రీఎంట్రీ ఇవ్వడం గురించి కూడా విమర్శలు వినిపించాయని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తన కొడుకుని ఉన్నతంగా తీర్చిదిద్ది గొప్ప తల్లిగా నిలిచి ఇలా నా గురించి విమర్శలు చేసిన వారందరికీ సరైన సమాధానం చెబుతాను ” అంటూ కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Kajal Aggarwal: వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్…


కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా బిడ్డ పుట్టిన తర్వాత ఇండస్ట్రీలో ఇచ్చిన కాజల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు 2 నటించే అవకాశం అందుకుంది. అలాగే బాలకృష్ణతో కూడా కలిసి నటించబోతోంది. సాధారణంగా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత హీరోయిన్లుగా చాలామంది అవకాశాలు దక్కించుకోలేరు. కానీ కాజల్ మాత్రం ఇప్పటికే అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

3 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

3 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

4 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

5 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

6 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

6 hours ago