Movie News

Kalyan Ram: బాలయ్య టాక్ షోకి కళ్యాణ్ రామ్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా.. అసలు విషయం చెప్పిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఆహాలో ప్రసారమవుతూ ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ కార్యక్రమం ఇప్పటికే మొదటి సీజన్ పూర్తి చేసుకొని రెండవ సీజన్ కూడా పూర్తి కావస్తోంది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరు కాకపోవడం పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు నందమూరి హీరోలు అయినటువంటి కళ్యాణ్ రామ్ పాల్గొనలేదు. అలాగే మెగా హీరోలు అయినటువంటి రామ్ చరణ్ చిరంజీవి వంటి హీరోలు కూడా పాల్గొనలేదు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎందుకు పాల్గొనలేదు అనే ప్రశ్న తనకు ఎదురు కావడంతో తనకు ఆహా నుంచి ఆహ్వానం అందలేదని చిరంజీవి వెల్లడించారు.

ఇకపోతే తాజాగా కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తనకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ ఇదే ప్రశ్న ఆహా వారిని అడగాలి అంటూ సమాధానం చెప్పారు.

Kalyan Ram: బాలయ్య ద్వారా లాభాలను అందుకుంటున్న ఆహా…

ఇలా కళ్యాణ్ రామ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అన్ స్టాపబుల్ సీజన్ 3 మరి కొద్ది రోజులలో ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమం కోసమే పలువురు సెలబ్రిటీలను సీజన్ వన్, టు లకు ఆహ్వానించలేదని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే గెస్ట్ ల ఎంపిక బాలయ్యదేనని ఇలా బాలయ్య ద్వారా ఆహా భారీ లాభాలను అందుకుంటున్నట్టు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago