Senior Journalist Bhardwaja : ఈ మధ్య దిల్ రాజుకి రోజులు అసలు బాగోలేదేమో అనిపిస్తుంది. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో ఏ గొడవ జరిగినా చివరకు దిల్ రాజు వద్దకు వచ్చి నిలుస్తోంది. నిర్మాతల బంద్ అని సినిమా షూటింగులను ఆపేసి మళ్ళీ తన సినిమా మాత్రమే షూటింగ్ చేసాడు. ఇదేమని అడిగితే అది తమిళ సినిమా అని చెప్పాడు. ఇక విడుదల సమయంలో డబ్బింగ్ సినిమాను పండుగ అపుడు విడుదల చేయకూడదని తానే చెప్పి మళ్ళీ ‘వారసుడు’ సినిమా విడుదల చేసాడు. అదేమని అడిగితే అది ద్విభాష చిత్రం అని చెప్పాడు. ఇలా ప్రతి ఇష్యూలోనూ ఇరుక్కుంటున్న దిల్ రాజ ఇప్పుడు గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ తో పెట్టుకున్నాడు. ఈ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.
పరుశురాంతో గొడవ, సీన్ లోకి దిల్ రాజు…
అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలను పబ్లిక్ కు చెప్పాలనుకునే లోపే సీన్ రివర్స్ అయి ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది. అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలనుకున్నారు, అసలు డైరెక్టర్ పరుశురాంతో గొడవ ఏమిటి అనే విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు. అల్లు అరవింద్ పరుశురాం డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలక్షన్ ముందే సినిమా వచ్చేలా ప్లాన్ చేయాలని అల్లు అరవింద్ ప్లాన్. కథ చర్చలు జరుగుతున్నాయి, ఆఫీసిషియల్ ప్రకటన కూడా వచ్చిన తరువాత కొద్దిరోజులకు పరశురాం దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఇదే అల్లు అరవింద్ కు పరశురాం పై కోపానికి కారణం. అల్లు అరవింద్ విషయం వేరే వాళ్ళ ద్వారా తెలిసీ అడిగినపుడు కూడా చెప్పకపోవడం అదీకాక పరుశురాం, దిల్ రాజు ఆఫీసియల్ ప్రకటన రాకముందే ఒకసారి తనకు చెప్పుండాలి కదా అనే అంశం వల్ల కోపం పెరిగింది. దిల్ రాజుని ముందు అడిగినపుడు కూడా ఏమీ చెప్పకుండా ఇలా చేసినందుకు ప్రెస్ మీట్ పెట్టి కామెంట్స్ చేయాలనుకున్నాడు అల్లు అరవింద్.
అయితే వెంటనే పరుశురాం వెళ్లి క్షమాపణ చెప్పడం, అరవింద్ ఇక నీ లైఫ్ లో లేడు అన్నట్లుగా అరవింద్ గారు మాట్లాడటం, ఆపై దిల్ రాజు మాట్లాడటం వల్ల కొంత వెనక్కి తగ్గినా ఒక ఇష్యూ కోసం మీడియా ముందుకు వెళితే నిర్మాతల మధ్య ఉన్న సమస్యలు మరోసారి బయటకు వచ్చి ఒకటనుకుంటే ఇంకేదో అవుతాయని ఇతరులు సలహా ఇవ్వడంతో అరవింద్ వెనక్కి తగ్గారు. నిజానికి పరుశురాంకు బ్రేక్ ఇచ్చింది అల్లు అరవింద్ గారు ‘గీత గోవిందం’ సినిమాతో. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఆ సంస్థతో చేయాల్సి ఉంది అలాంటపుడు పరుశురాం ఇలా చేయడం అతని కెరీర్ మీద ప్రభావం చూపుతుంది అంటూ చెప్పారు భరద్వాజ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…