Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.అందరి హీరోలు మాదిరిగా కాకుండా కళ్యాణ్ రామ్ తరచూ ప్రయోగాత్మక సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే గత ఏడాది బింబిసార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈసారి అమిగోస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ మొదటి సారి తన చేతిపై ఉన్నటువంటి టాటూ గురించి అసలు విషయం వెల్లడించారు.కళ్యాణ్ రామ్ చేతి పై తన భార్య స్వాతి పేరును టాటూగా వేయించుకున్నారు.
ఇలా తన భార్య పేరును టాటూగా వేయించుకున్న కళ్యాణ్ రామ్ ఆ పేరుని ఎందుకు వేయించుకోవాల్సి వచ్చిందో తెలిపారు. 2007 -8సంవత్సరం టైంలో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని అయితే ఆ సమయంలో తన భార్య దగ్గరుండి తన యోగక్షేమాలను తన అవసరాలను చూసుకుందని తెలిపారు.సాధారణంగా చాలామందికి నర్సులని పెట్టి సేవ చేస్తారు. కానీ తన భార్య తనకు సేవ చేసిందని తెలిపారు. తనని ఒక అమ్మలా ఆదరించిందని తెలిపారు.
ఇకపోతే తన పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వాతికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను తనకు ఏం కావాలో అడగమని చెబితే స్వాతి మాత్రం నాకు మీరు మన పిల్లల పెద్ద గిఫ్ట్ అని సమాధానం చెప్పింది. ఆ క్షణం తనపై ఎంతో గౌరవం ప్రేమ కలిగిందని ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలన్న ఉద్దేశంతో తన పేరును టాటూగా వేయించుకున్నానని తెలిపారు.నిజానికి తనకు సూదులు అంటే చాలా భయమని కానీ స్వాతి పై ఉన్న ప్రేమతోనే తన పేరును టాటూగా వేయించుకున్నట్లు ఈ సందర్భంగా టాటూ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…