Categories: FeaturedMovie News

Kangana Ranaut : బ్రాహ్మస్త్ర తీసి 600 కోట్లు తగలబెట్టారు… కరణ్ జోహార్ ఫేక్ రివ్యూలతో హిట్ అని డబ్బా కొడుతున్నాడు : కంగనా రానౌత్

Kangana Ranaut : బాలీవుడ్ లో సూటిగా ఒకరిని విమర్శించాలంటే కంగనా ముందుంటుంది. ముఖ్యంగా కరణ్ జోహార్ మరియు నెపోటిజం గురించి మాట్లాడాలంటే కంగనానే గుర్తొస్తుంది బాలీవుడ్ మీడియాకి. సెప్టెంబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా ‘బ్రాహ్మస్త్ర’ సినిమా విడుదల అయింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రన్ బీర్, ఆలియా జంటగా నటించిన ఈ ఫాంటసీ డ్రామా కొంతమందికి నచ్చింది. కొంత మందికి నచ్చడం లేదు. ఇక కంగనా కూడా ఈ సినిమా గురించి ఘాటుగా స్పందించింది. సినిమా చెత్తగా ఉందంటూ ఫైర్ అయింది.

600 కోట్లు కాల్చేశాడు అయాన్ ముఖర్జీ…

సినిమా బాగోలేదని చెప్పడం వరకూ ఓకే కానీ మరీ సినిమా కోసం 600 కోట్లు తగలేశాడంటూ డైరెక్టర్ మీద ఫైర్ అయింది బాలీవుడ్ క్వీన్. సినిమా కోసం 12 ఏళ్ళు కష్టపడిన అయాన్ 400 రోజులకు పైగా షూట్ చేసి, 14 మంది డీఓపీలను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లని మార్చి రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశాడు అంటూ ఫైర్ అయింది. బ్రాహ్మస్త్ర సినిమా బడ్జెట్ సరి చేసుకోడానికి ఫాక్స్ స్టూడియోస్ అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చారు.

ఇలాంటి సినిమాల వల్ల ఇంకెన్ని స్టూడియోలు మూతపడతాయో అంటూ కామెంట్స్ చేసింది. ఇక కరణ్ జోహార్ మీద ఘాటు వాఖ్యలు చేసింది కంగనా. ఫేక్ రివ్యూలు చెప్పేవారిని, రేటింగ్ సంస్తలను కొని హిట్ అని చెప్పుకోవడం అతనికి కామన్. హిందూ మతాన్ని అణిచివేయాలని, సౌత్ వేవ్ ను తొక్కేయాలని చూస్తున్నాడు, సెలబ్రిటీల శృంగార జీవితం మీద ఉన్న ఆసక్తి కరణ్ జోహార్ కు సినిమా స్క్రిప్ట్ మీద లేదు అంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago