Karate Kalyani : గత కొన్ని రోజులుగా కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి వివాదం సోషల్ మీడియాలో బాగా రచ్చ అయింది. ఇక ఈ వివాదంలో ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టుకోవడం దూషించుకోవడంతో పాటు ఇరువురు పోలీస్ కేసు కూడా పెట్టుకున్నారు. లక్ష రూపాయలు ఇమ్మని నన్ను బెదిరించింది అంటూ శ్రీకాంత్ రెడ్డి, నన్ను అసభ్యకరంగా తాకాడు అంటూ కరాటే కళ్యాణి మీడియా ముందు ఆరోపణలు చేసుకున్నారు.
కరాటే కళ్యాణి ఎస్ ఆర్ నగర్ లోని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మరీ గొడవపెట్టుకుంది ఇక ఆ సమయంలో తనతో పాటు పసిపాపను కూడా తీసుకుపోయింది. ఇక గొడవలో శ్రీకాంత్ రెడ్డి, కరాటే కళ్యాణి పై చేయి చేసుకున్నప్పుడు చిన్నపిల్ల కూడా కిందపడిపోయింది. దీంతో పసిపిల్లపై అందరి దృష్టి మళ్లింది. అసలు ఎవరు ఆ పాపా అనే చర్చ మొదలయింది. ఇక విషయానికి వస్తే కరాటే కళ్యాణి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నట్లు తీసింది.
ఇక అసలు లీగల్ గా దత్తత తీసుకుందా లేదా అనే విషయమైన చైల్డ్ వెల్ ఫేర్ అధికారులు కరాటే కళ్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు అయితే ఆ సమయంలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో బయటికి వెళ్ళింది. కళ్యాణి తల్లి విజయలక్ష్మి అధికారులకు వివరిస్తూ తాము ఏ తప్పు చేయలేదు, చట్ట ప్రకారమే అమ్మాయిని దత్తత తీసుకున్నామని ఆమె తెలిపారు. 12 ఏళ్ల అబ్బాయిని కళ్యాణి సాకుతోందని ఇప్పుడు మరొక అమ్మాయిని పెంచుకుంటోందని విజయలక్ష్మీ స్పష్టం చేశారు. డిసెంబర్ 25న పుట్టిన పాపను 28న ఇంటికి తీసుకొచ్చిందని, అమ్మాయి పేరు మౌక్తిక అని ఆమె తెలిపారు. అబ్బాయిని శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చామని విజయలక్షీ చెప్పారు. చట్ట ప్రకారమే తాము పిల్లలను పెంచుకుంటున్నట్లు విజయలక్ష్మి స్పష్టం చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…