Categories: FeaturedMovie News

Srikanth Reddy : కరాటే కల్యాణి తో దెబ్బలు.. బిగ్ బాస్ సీజన్ 6లో ఛాన్సు కొట్టేసిన యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి..

Srikanth Reddy : గత కొద్దిరోజులుగా కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య వివాదం గురించి సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతోంది. ఎస్ ఆర్ నగర్ లోని శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ గొడవ పెట్టుకుంది. ఇక యూట్యూబర్ గా ప్రాంక్ వీడియోలు చేస్తూ కొంచెం కొంచెం గా ఫేమస్ అయిన శ్రీకాంత్ రెడ్డిని కరాటే కళ్యాణి ప్రాంక్ ల పేరుతో ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తావా అంటూ కొట్టడం ఆ తరువాత కళ్యాణి తో పాటు వచ్చిన వ్యక్తి కొట్టడంతో శ్రీకాంత్ కూడా కళ్యాణి చెంపపై చేయి చేసుకున్నాడు.

కళ్యాణి పడిపోవడంతో తన వెంట వచ్చిన వాళ్ళు శ్రీకాంత్ బాగా కొట్టారు. ఇక కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని ఎస్ ఆర్ నగర్ నుండి మధుర నగర్ వరకు తరిమి తరిమి కొట్టింది. ఇక సీన్ కట్ చేస్తే ఉదయాన్నే ఇటు కరాటే కళ్యాణి, అటు శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు పోలీసు కేసుల దాకా వెళ్లారు. కరాటే కళ్యాణి తనను లక్ష రూపాయలు డబ్బు అడిగిందని ఇవ్వను అన్నందుకు నాపై దాడి చేసిందని తాను కూడా సినిమాల్లో బాబీ లాంటి వ్యాంప్ పాత్రల్లో నటించింది కదా నేను ఎవరిని మోసం చేయలేదు పెయిడ్ ఆర్టిస్టులతో ప్రాంక్ వీడియోలు చేస్తున్నాను అంటూ కళ్యాణి పై ఆరోపించాడు. ఇక కళ్యాణి కూడా అతనిపై ఆరోపణలు చేసింది. ఇక కళ్యాణి పై అటెంప్ట్ టూ మర్డర్, దాడి కేసులు పెట్టడు. ఇక చివరకు ఏడుపు కూడా మీడియా ముందు ఏడ్చేసింది. కాగా కథ ఇపుడు మరో మలుపు తీసుకుని కళ్యాణి ఇంటి నుండి వెళ్లి కనిపించడం లేదంటూ తల్లి ఆందోళన చెందుతోంది.

బిగ్ బాస్ లో ఛాన్స్…

ఇక ఎన్ని మలుపు తిరిగినా ఈ ఉదంతానికి ఎపుడు బ్రేకులు పడతాయో కానీ శ్రీకాంత్ రెడ్డి మాత్రం ఈ సంఘటన తరువాత మరింత ఫేమస్ అయ్యాడు. యూట్యూబర్ గా ఎంత గుర్తింపు వచ్చిందో కానీ ఈ ఎపిసోడ్ తో మాత్రం బాగా ఫేమస్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ సీజన్ తుది దశకు చేరుకుంది. ఇక నెక్స్ట్ సీజన్ పై అపుడే చర్చలు మొదలయ్యాయి. బిగ్ బాస్ నాన్ స్టాప్ నెక్స్ట్ సీజన్ కోసం శ్రీకాంత్ రెడ్డిని ఒక కంటెస్టెంట్ గా తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సీజన్ లో యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేస్తూ ఫేమస్ అయిన యాంకర్ శివ ఈ సీజన్ లో టాప్ 5 లో ఉన్నాడు. ఇక ఈ టాప్ 5 లో కొంత మందిని నెక్స్ట్ సీజన్ కోసం మళ్ళీ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీం. ఇక శ్రీకాంత్ రెడ్డి బిగ్ బాస్ లో అడుగుపెడితే కాంట్రావర్సీతో మరింత గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం. ఖచ్చితంగా ఇది తన కెరీర్ కు ప్లస్ అనే చెప్పాలి. అయితే ఈ విషయాన్ని ఇంక అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక నెక్స్ట్ సీజన్ కోసం యాంకర్లు మంజూష, రోషన్ లను తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago