Movie News

Karate Kalyani : మంచి భర్త దొరికితే అంతకంటే అదృష్టం ఏముంటుంది.. నా అందమే నాకు శాపమైంది… ఇప్పటికీ పిల్లలను కనాలని ఉంది.. : కరాటే కళ్యాణి

Karate Kalyani : బాబీ అంటూ… కృష్ణా సినిమాతో బాగా ఫేమస్ అయిన కరాటే కళ్యాణి, ఆ మధ్య బిగ్ బాస్ కి వెళ్లి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక ఈమధ్య యూట్యూబర్ శ్రీకాంత్ తో గొడవ, పోలీస్ కేసులు అంటూ సోషల్ మీడియాలో బాగా నానింది. ఇక ఇప్పుడు కళ్యాణ రాగాలు పాడుతూ చాంతాడంత పెద్ద పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కలల రారాజు గురించి మాట్లాడింది. ఇక ‘మగాళ్లు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే ’ అంటూ జీవితానుభవాలు చెబుతోంది. ఈ మధ్య కాషాయ జండా కప్పుకున్న కళ్యాణి హిందూ ధర్మ పరిరక్షణ తో మళ్ళీ రచ్చచేస్తోంది.

నా అందమే నాకు శాపమైంది…

నీ అంత మంచి మనిషి లేదు.. నువ్వు తోపు, తురుము, నీతో జీవితాంతం ఉంటా, లేదంటే చచ్చిపోతా అని నిన్ను ముగ్గులోకి దించేదీ వాడే మోజు తీరాక అంటే కొంతకాలం లవ్ ట్రాక్ నడిపిన తరువాత నీ డామినేషన్ ఏంటి మూసుకొని కూర్చో, లేదా వేరే పెళ్లి చేసుకుంటా ఎక్కువ మాట్లాడకు అంటాడు. అప్పటికీ నువ్వు వాడి మత్తులో ఉంటావ్ పిచ్చిదానిలా, నువ్వు చెప్పింది చేస్తా నాన్న, కన్నా, నన్ను వదలకు అని ప్రాధేయపడి వాడికి సొమ్ములు ఇస్తావ్. అడుగులకు మడుగులు ఒత్తి, అతనితోనే ఉంటావ్. ఇక అప్పటి నుంచి మొదలు సారు ప్రతాపం, ఆ బట్టలు ఏంటి, ఆ జుట్టు అలా ఉంది ఏంటి ఇంతసేపు ఎక్కడకి వెళ్లావ్? వాడెవడు నీతో మాట్లాడుతున్నాడు, అందరితోనూ మాటలా, మీ తమ్ముళ్లు, మీ అమ్మ నాన్న ఎవ్వరూ రాకూడదు. సినిమా నేను తీసుకెళ్తే రావాలి పిల్లలు పుట్టాక పని మానేయాలి, ఇలా ఒకటా రెండా అనుమానం ముందు పుట్టి వీడు వెనుక పుట్టాడా? అన్నట్టుగా, ఇలా చిత్ర హింసలు చేసి చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత వదిలి వెళ్తారు. మీరు మోసం చేసి, ఆడవాళ్ళు మోసం చేశారని అంటారు.

నాన్న ప్రేమ తప్ప ఇంకేది శాశ్వతంగా ఉండదు. మగాళ్లు వట్టి మాయగాళ్లు, ఇదే నిజం, నిజంగా మంచిభర్త దొరికితే అదృష్టం అంటారు. నాకు ఈ జన్మకి అదిలేదు అనుకొని బ్రతికే నన్ను నా స్నేహితురాలు కెలికింది అంటూ భారీ పోస్ట్ పెట్టినా, పోస్ట్ సారాంశం మగాళ్ళు మోసగాళ్లు, ఈ జన్మకి మంచి వాడు దొరుకుతాడు అనే నమ్మకం లేదు వచ్చే జన్మ లో అయినా నా కలల రాకుమారుడు దొరుకుతాడనే నమ్మకంతో ఎదురుచూస్తా అంటూ, ఈ జన్మలోనే పెళ్లి చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు కానీ ఈ పోరాటాలు చేసే ఈ గయ్యాళిని ఎవరు చేసుకుంటారు అంటూ, అందమే కొంతమందికి శాపమవుతుంది అంటూ పోస్ట్ పెట్టింది కళ్యాణి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago