Movie News

Relangi Narasimha Rao : రాజేంద్ర ప్రసాద్ ఏవి లో నేను లేకపోవడంతో చాలా హర్ట్ అయ్యాను… ఆయన మమ్మల్ని జూలో జంతువుల్లా చూసేవారు..!

Relangi Narasimha Rao : పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు.

వేదికపై నన్ను అవమానించారు…

ఇక రేలంగి గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా ఎక్కువ సినిమాలను తీశారు. హాస్య ప్రధాన సినిమాలను తీసే ఈయన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, సంసారం, సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దోడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను తీసారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో దాదాపు ముప్పై సినిమాలను చేసారు రేలంగి. రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన ఏ వి ప్రదర్శన జరిగినపుడు ఆయన సినిమా ప్రయాణం లో రేలంగి గారి పేరు ప్రస్తావించలేదట. దీంతో రేలంగి గారు అవమానంగా ఫీల్ అయి అక్కడి నుండి వెళ్లి పోయారట. అయితే వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారి పి ఏ వచ్చి సర్ది చెప్పి కాళ్ళు పట్టుకునేంత పని చేసాడట కానీ రేలంగి గారు వెళ్లిపోయాడట.

జూలో జంతువులను ఆడించినట్లు ఆడిస్తారు…

చలం గారితో సినిమా మొదలు పెట్టి మధ్యలోనే రేలంగి గారు తప్పుకున్నారు. దీనికి కారణాలు అడుగగా మొత్తం అన్ని పనులూ ఆయనే చూసుకుంటారు, డైరెక్టర్ ఆయన కట్ చెప్పమన్నపుడు కట్ చెప్పాలి స్టార్ట్ చెప్పినపుడు స్టార్ట్ చెప్పాలి. ఆయన మనిషే మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మనిషే కెమెరా మాన్ అలా ఉంటారు, విగ్రహ చందంగా డైరెక్టర్ ఉంటాడు. ఆయన జూలో జంతువులను ఆడిస్తుంటే, మనం అలా ఆడాలి. ఇది నచ్చక మూడో రోజే ఆయనకు చెప్పేసాను. నేను ఇలా చేయలేనని చెబితే నా గురించి తెలుసుకుని వచ్చుంటావు అనుకున్నాను అన్నారు. మీరే సినిమా చేయమని అడిగితే వచ్చా మీ మెంటాలిటీ నాకు తెలియదు, నేను చేయలేను అని లెటర్ రాసి వచ్చేసాను అని చెప్పారు.

ఇక హీరోయిన్ జయచిత్ర విషయంలో మాట మాట పెరిగిందని, ఒక సన్నివేశం విషయంలో అలా కాదు అన్నందుకు మీరు చేసి చూపించండి అని అనగా వెంటనే రేలంగి గారు చేసి చూపించారట దీంతో ఆవిడ ఇంకేం మాట్లాడలేదట. మళ్ళీ మూడు రోజుల వరకు మాటల్లేవట, ఇక మళ్ళీ మామూలుగా మాట్లాడటం జరిగాయని రేలంగి గారు అప్పటి విషయాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago