Featured

Karate Kalyani : బికినీ వేసుకోలేదు… బతుకు తెరువు కోసం చేస్తే తప్పేంటి?? ఆర్ధిక పరిస్థితి ఏంటంటే…: కరాటే కళ్యాణి

Karate Kalyani : తెలుగు కమెడియన్ గా వాంప్ తరహా పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందిన నటి కరాటే కళ్యాణి. ముఖ్యంగా తను ఒక సినిమాలో ‘బాబీ…’ అనే డైలాగుతో బాగాఫేమస్. ఇక సినిమాల్లో నటించడమే కాకుండా అప్పుడప్పుడు బయట వివాదాలతో కూడా బాగా ఫేమస్ అయింది కళ్యాణి. ప్రస్తుతం బీజేపీ లో చేరి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరడుతోంది. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రైవేట్ ఆల్బమ్ లో బికినీ వేసుకుని ‘హరే రామ హరే కృష్ణ’ పదాలను వాడటం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు. ఇక తన వ్యక్తిగత విషయాలను చాలా మంది తనను నెగెటివ్ గా కామెంట్స్ చేయడం గురించి ఇంటర్వ్యూలో కళ్యాణి ఎమోషనల్ అయ్యారు.

బికినీ వేసుకోలేదు… బ్రతుకు తెరువు కోసమే…

దేవి శ్రీ ప్రసాద్ తన కొత్త ఆల్బమ్ లో హరే రామ్ హరే కృష్ణ అనే హిందువులు పవిత్రంగా భావించే మంత్రాన్ని బికినీ వేసుకున్న అమ్మాయి చేత ఉచ్చరించడం బాగోలేదంటూ కళ్యాణి ఏకాంగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ ఇష్యూలో కళ్యాణి ఒకప్పుడు విక్రమార్కుడు లో కూడా ఇలాంటి ఒక గీతాన్ని ఆలపించారు అందులో దేవుళ్లను ఐటమ్ సాంగ్ లో పాడారు కదా అనే ప్రశ్న ఎదురవ్వగా నేను బికినీ వేసుకుని పాట పాడలేదంటూ కళ్యాణి బదులిచ్చారు. ఇక తాను వాంప్ పాత్రలు చేసినా అది కేవలం సినిమాల్లో మొదట్లో అవకాశాల కోసమే కానీ సినిమాల్లో చేసినట్లే నిజ జీవితంలో ఉంటానన్నట్లు అందరూ ట్రోల్స్ చేసారంటూ ఎమోషనల్ అయ్యారు కళ్యాణి.

ఇక తాను సినిమాల్లో ఇకపై వాంప్ వంటి పాత్రలు చేయకూడదని భావించినట్లు అందుకే సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నానని కళ్యాణి తెలిపారు. ఇక తాను సామాజిక అంశాల మీద పోరాడుతున్నా తన బ్రతుకు తెరువు ఎలా అన్న విషయం గురించి మాట్లాడుతూ హరికథలు చెబుతూ డబ్బు సంపాదిస్తానని అలానే ఈవెంట్లలో పాల్గొంటూ యాంకరింగ్ కూడా చేస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఇక తన తమ్ముడికి డబ్బింగ్ స్టూడియో పెట్టించడం వల్ల అందులో వచ్చే ఆదాయం కొంత ఉపయోగపడుతుందని తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago