Movie News

Karate Kalyani: తేజస్విని కమిట్మెంట్ పై కరాటే కళ్యాణి పిర్యాదు.. బూతు సన్నివేశాలకు శ్లోకం ఎలా వాడుతారంటూ?

Karate Kalyani: తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలలో నటించిన సినిమా కమిట్మెంట్. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

గత రెండు సంవత్సరాల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. అప్పట్లో ఈ ట్రైలర్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. తాజాగా ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ విడుదల కావడానికి సిద్ధం కావడంతో మరోసారి ఈ సినిమా నుంచి ఇంకో ట్రైలర్ విడుదల చేశారు.అయితే ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా పలు వివాదాలకు దారి తీస్తోంది.

ఇందులో తేజస్వి ఎంతో శృంగార భరితంగా నటించారని, లిప్ లాక్ సన్నివేశాలు బోల్డ్ సీన్స్ ఉండటమే కాకుండా ఇలాంటి బూతు సన్నివేశాలకు భగవద్గీత బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే బూతు వీడియోకి భగవద్గీత మ్యూజిక్ ఎలా పెడతారు అంటూ ఈ ట్రైలర్ పై కేసు వేశారు.

Karate Kalyani: హిందువుల మనోభావాలను కించపరిచారు….

ఈ క్రమంలోనే ఈ వివాదం పై నటి కరాటే కళ్యాణి స్పందించారు. ఈ సందర్భంగా ఈమె ఈ ట్రైలర్ వీడియో పై స్పందిస్తూ ఈ బూతు వీడియోకి భగవద్గీత శ్లోకం ఉండటాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది. ఇలా భగవద్గీత శ్లోకం ఉపయోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అంటూ కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఈమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది..l

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago