బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కరీనా కపూర్ గురించి ఎవరికీ పరిచయం అవసరం లేదు. టీవీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినప్పటికీ ఏమాత్రం చెరగని అందంతో నేటి యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు.
కరీనాకపూర్ తాజాగా తన రెండవ బిడ్డ ‘జే’ జన్మించిన తర్వాత సినిమాలకు కాస్త విరామం చెబుతూ తన పిల్లల బాధ్యతలు చూసుకుంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీ పలు యాడ్స్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాడ్స్ షూటింగ్ లో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా కరీనా కపూర్ అనిల్ కపూర్‌తో కలిసి ఒక ప్రముఖ జ్యూవెలరీ సంస్థకు ఎండార్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ షూటింగ్ కి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలలో కరీనాకపూర్ ధరించిన డ్రెస్ ఎంతోమంది ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది.
ఈ ఎండార్స్ షూటింగ్ లో భాగంగా.. జార్జెట్ ఎంబ్రాయిడరీ ఎల్లో కలర్ అనార్కలి డ్రెస్ ధరించి, అందుకు సరైన జ్యూయలరీని ధరించి ఎంతో అందంగా ముస్తాబై ఉన్నారు. అయితే ఈ షూట్ లో భాగంగా కరీనాకపూర్ ధరించిన డ్రెస్ ధర తెలిస్తే మాత్రం దిమ్మతిరుగుతుంది. ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ డ్రస్ అక్షరాల.. లక్షా నలభై ఎనిమిది వేల రూపాయలు. ఈ అద్భుతమైన డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ రిధి మెహ్రా రూపొందించారు.ప్రస్తుతం కరీనా కపూర్ ఈ డ్రెస్ లో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…