వామ్మో.. కరీనా ఆ డ్రస్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. అసలేముందా డ్రెస్సులో..?

0
490

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కరీనా కపూర్ గురించి ఎవరికీ పరిచయం అవసరం లేదు. టీవీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినప్పటికీ ఏమాత్రం చెరగని అందంతో నేటి యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు.

కరీనాకపూర్ తాజాగా తన రెండవ బిడ్డ  ‘జే’ జన్మించిన తర్వాత సినిమాలకు కాస్త విరామం చెబుతూ తన పిల్లల బాధ్యతలు చూసుకుంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీ పలు యాడ్స్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాడ్స్ షూటింగ్ లో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు.

తాజాగా కరీనా కపూర్ అనిల్‌ కపూర్‌తో కలిసి ఒక ప్రముఖ జ్యూవెలరీ సంస్థకు ఎండార్స్‌ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ షూటింగ్ కి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలలో కరీనాకపూర్ ధరించిన డ్రెస్ ఎంతోమంది ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది.

ఈ ఎండార్స్‌ షూటింగ్ లో భాగంగా.. జార్జెట్ ఎంబ్రాయిడరీ ఎల్లో కలర్ అనార్కలి డ్రెస్ ధరించి, అందుకు సరైన జ్యూయలరీని ధరించి ఎంతో అందంగా ముస్తాబై ఉన్నారు. అయితే ఈ షూట్ లో భాగంగా కరీనాకపూర్ ధరించిన డ్రెస్ ధర తెలిస్తే మాత్రం దిమ్మతిరుగుతుంది. ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ డ్రస్ అక్షరాల.. లక్షా నలభై ఎనిమిది వేల రూపాయలు. ఈ అద్భుతమైన డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ రిధి మెహ్రా రూపొందించారు.ప్రస్తుతం కరీనా కపూర్ ఈ డ్రెస్ లో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here