Kareena Kapoor: నాటు నాటు సాంగ్ పెడితేనే నా కొడుకు ముద్ద తింటున్నాడు… నటి కామెంట్స్ వైరల్!

0
14

Kareena Kapoor: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి త్రిబుల్ ఆర్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే నటి కరీనాకపూర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి వాట్ వుమెన్ వాంట్ అనే కార్యక్రమం నాలుగవ సీజన్ ప్రసారమవుతుంది ఇందులో భాగంగా కరీనాకపూర్ నాటు నాటు పాట గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటు నాటు పాట చరిత్ర సృష్టించిందని ఈ పాట రెండేళ్ల కుమారుడి మనసును సైతం కొల్లగొట్టిందని తెలిపారు.

తన చిన్న కుమారుడు జెహ్ నాటు నాటు పాట పెడితే కానీ ముద్ద తినడని ఈమె తెలియజేశారు. ఇక తన కుమారుడికి హిందీలో కాకుండా తెలుగు వెర్షన్ పాట పెడితేనే తాను చాలా సంతోషంగా గంతులు వేస్తూ భోజనం చేస్తాడని ఈ సందర్భంగా ఈమె నాటు నాటు గురించి ఆ పాటకు తన కుమారుడు స్పందించే విధానం గురించి తెలిపారు.


Kareena Kapoor: ఈ పాట మ్యాజిక్ క్రియేట్ చేసింది…

ఆస్కార్ గెలిచిన ఈ పాట ఈ సినిమాకి ఎంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిందోచెప్పడానికి ఇదే సరైన ఉదాహరణ అంటూ కరీనాకపూర్ నాటు నాటు పాట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా నాటు నాటు పాట గురించి సెలబ్రిటీలు కూడా ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా ఈ పాటకు డాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు.