జరగదు.. నా భర్తతో నీ పెళ్లి అసలు జరగదు.. మోనితకు షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన వంటలక్క!

0
547

బుల్లితెరపై రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1098 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో భాగంగా దీప, కార్తీక్, మోనిత మధ్య ఎంతో రసవత్తరంగా ఈ సీరియల్ కొనసాగింది. ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే.. అర్ధరాత్రి కార్తీక్ కోసం దీప ఇంటికి వెళ్లిన మోనిత దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. అయితే అది చూసిన దీప ఇక్కడ ఎవరు పడుకొని ఉంటారు. అంటూ డాక్టర్ బాబు అనుకుని డాక్టర్ బాబు అంటూ.. నిద్ర లేపుతుంది. ఎంతసేపటికి లేవకపోతే దుప్పటి తీసి చూడగానే మోనిత కనిపించేసరికి దీప షాక్ అవుతుంది. దీపను చూసి ఏంటి కంగారు పడ్డావా..మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడ పడుకున్నాను అంటూ చెప్పడంతో దీప మోనిత బయటకు లాక్కొని వస్తుంది.

ఈ విధంగా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో బయట హాస్పిటల్ లో పడుకున్న కార్తీక్ లేచి అక్కడికి వెళ్లడంతో కార్తీక్ ను చూసిన మోనిత ఇక్కడ పడుకున్నావా.. ఇంతవరకు బెడ్రూంలో పడుకున్నావని, నేను హాల్ లో పడుకొని టైం వేస్ట్ చేశాను అని చెబుతుంది. అదేవిధంగా నా ఒంటరితనం నీ ఏకాంతాన్ని కోరుకుంటుంది.. నువ్వు రమ్మంటే రావు నేను వస్తానంటే వద్దంటావా అనగా అసలు ఏం చేస్తున్నావో తెలుసా..? అడ్డు కార్తీక్ కోపంతో అరుస్తాడు. ఈ విధంగా మోనిత మాట్లాడే మాటలకు కార్తీక్ కు ఎంతో కోపాన్ని తెప్పిస్తాయి.ఈ క్రమంలోనే ఇదివరకు నీ పై ఎంతో గౌరవం ఉండేది ఇప్పుడు నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. నీకు సిగ్గు అనిపించడం లేదా అంటూ ప్రశ్నించగా ఇందులో తప్పేముంది.. నేను నీకు ఆడదానిగా కనిపించలేదా అంటూ మోనిత అనగా.. నాకు ఆడదాని లాగా కనిపించింది ఈ పాటికి ఎప్పుడో తల్లివి అయ్యే దానివి అంటూ కార్తీక్ సమాధానం చెబుతాడు.

ఈ క్రమంలోనే దీపతో పోల్చడం కోపంతో కార్తీక్ దీపతో పోల్చుకోకు దీప దేవుడు ముందు వెలిగే దీపం.. నువ్వువీధి దీపం లో నిలబడ్డామని కార్తీక్ అనడంతో వీధిలోకి నిలబెట్టింది నువ్వే కదా.. అంటూ మోనిత సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే దీపతో మోనిత మాట్లాడుతూ.. నేనే కనుక నీ చెల్లి అయి ఉంటే.. నీ భర్త అదే నా బావ తొందరపడి నన్ను లొంగదీసుకొని ఉంటే ఇలాగే చేసేదానివా.. గుట్టుచప్పుడు కాకుండా నా బాబుకు నన్ను ఇచ్చి పెళ్ళి చేసే దానివి కదా దీపక్క అనడంతో కార్తీక్ కోపంతో స్టాప్ ఇట్ మోనిత ఇప్పటికి నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఇలా అర్థరాత్రి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నావ్ అంటూ ఆమె పై విరుచుకు పడతాడు.

ఈ సందర్భంలో దీప కలగజేసుకుని డాక్టర్ బాబు లోపలికి వెళ్లి పిల్లల దగ్గర పడుకోమని చెబుతుంది. ఆతరువాత దీప మోనితతో ఇంత బరితెగించి.. విచ్చలవిడిగా అర్ధరాత్రి నా భర్త కోసం.. నా ఇంటికి వచ్చి ఇంత చండాలంగా.. నీతిమాలిన… పెళ్లి కాకుండానే నెలతప్పిననువ్వు ఇంత మాట్లాడుతున్న నేనే ఏమి చేయకపోవడానికి కారణం ఇంట్లో పిల్లలు ఉన్నారని ఉద్దేశంతో మాత్రమే. నీ చరిత్ర ఇంట్లో ఉన్న పిల్లలకు తెలిస్తే బాగుండదు అన్న కారణంతో మాత్రమే.. లేకపోతే అక్క.. అన్నందుకు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేదాన్ని.. అంటూ దీప చెడామడా తిట్టి పోస్తోంది. జరగదు.. నా భర్తతో నీ పెళ్లి అస్సలు జరగదు అంటూ మోనిత బెదిరిస్తుంది. భయంతో అక్కడినుంచి ఇంటికి వెళ్ళిన మౌనిత నిజంగానే దీప అన్నంత పని చేస్తుందా… ఏంటి దాని కాన్ఫిడెన్స్ అంటూ భయపడి పోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here