AP Elections: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున సెలబ్రిటీలు రాజకీయ నాయకులందరూ కూడా క్యూ లైన్ లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రాలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇక ఈ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల కొన్ని అవాంతరాలు చోటు చేసుకున్నాయి. ఈవీఎం మిషన్లు పని చేయకపోవడంతో క్యూ లైన్ లలో నిలబడినటువంటి ఓటర్లు వెనతిరిగి వెళుతున్నారు. అయితే ఎన్నికల అధికారుల భద్రత లోపమే ఇందుకు కారణమని తెలుస్తుంది.
ఇలా ఈవీఎం మిషన్స్ పనిచేయకపోవడంతో ఓటర్లు క్యూ లైన్లో నిలబడలేక వెనుతిరిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇకపోతే మరికొన్ని ప్రాంతాలలో వైసిపి టిడిపి కార్యకర్తల మధ్య తీవ్రమైనటువంటి గొడవలు చోటుచేసుకున్నాయి పలు ప్రాంతాలలో రెండు పార్టీల మధ్య గొడవలు చోటు చేసుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయాలు పాలయ్యారు.
కార్యకర్తల మధ్య గొడవలు…
ఇక ఎన్నికలు అన్ని ప్రాంతాలలో సజావుగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టిన కొన్నిచోట్ల మాత్రం ఓటర్లు ఎన్నో అవస్థలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాలలో జరిగే పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహిస్తున్నారు.





























