Ntr: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల వివాదాలు చోటుచేసుకున్న అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇకపోతే సెలబ్రిటీలు సైతం క్యూ లైన్ లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

పలువురు సెలబ్రిటీలు ఏపీలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా మరికొందరు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి వారు ఉదయమే తమ ఓటును వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఓటు వేయడానికి ఎన్టీఆర్ అల్లు అర్జున్ వేసుకున్నటువంటి దుస్తులు ప్రస్తుతం ఏపీ రాజకీయాల పరంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతున్నాయి.
ఎన్టీఆర్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఓటు వేశారు అలాగే అల్లు అర్జున్ వైట్ కలర్ టీ షర్ట్ ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా వీరిద్దరూ బ్లూ కలర్ వైట్ కలర్ డ్రెస్సులు వేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవడంతో పరోక్షంగా ప్రజలకు ఏం తెలియజేస్తున్నారో అన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి.
వైసీపీకి మద్దతు..
ఎన్టీఆర్ అల్లు అర్జున్ తమ దుస్తుల ద్వారా పరోక్షంగా వైసిపికి సపోర్ట్ చేస్తూ… ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని చెప్పకనే చెబుతున్నారా అంటూ పెద్ద ఎత్తున వీరిద్దరి దుస్తులపై చర్చలు మొదలయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరీ దుస్తులపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.



























