AP Elections: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి విజయం ఎవరిది అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగస్తులు అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ క్రమంలోనే ఉద్యోగస్తులందరూ కూడా ఎటువైపు ఉన్నారు. ఎవరికి మద్దతు తెలుపుతున్నారు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు కొంతవరకు మేలు చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా చేశారా అనే అపవాదం కూడా ఉంది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 50% ఉద్యోగాలను కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఉండగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరో రెండు లక్షల ఉద్యోగాలను కల్పించి యువతకు మంచి చేశారు.
జగన్ కే మద్దతు..
ఈ క్రమంలోనే ఈసారి కూడా ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఉద్యోగులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు ఇంకా మంచి చేస్తారని భావించి ఉద్యోగులందరూ కూడా జగన్ కే మద్దతు తెలుపుతున్నారని తెలుస్తోంది. ఇక బాబును నమ్మి ఇప్పటికే ఎన్నోసార్లు మోసపోయారు మరోసారి మోసపోకూడదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.





























