YS Vijayamma: ఏపీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా కూటమి నేతలు ఎన్నో అసత్యపు వార్తలను ప్రచారం చేస్తూ వచ్చారు. ఇక చివరికి తన కన్నతల్లి విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపలేదంటూ ప్రచారాలు చేశారు కానీ వైయస్ విజయమ్మకు తన కూతురు షర్మిల కంటే కొడుకు జగన్ అంటేనే ఇష్టమని తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలిచాయి.

ఇటీవల వైఎస్ షర్మిలని గెలిపించాలి అంటూ ఈమె ఒక వీడియో విడుదల చేశారు అయితే ఈ వీడియోలో భాగంగా జగన్ పై తనకున్నటువంటి ప్రేమను చాటుకున్నారు. వైయస్సార్ ముద్దుల బిడ్డ వైయస్ షర్మిలమ్మ కడప పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తున్నారు తనకు ఓటు వేసి గెలిపించాలని ఈమె అందరిని వేడుకున్నారు.
ఇక ఈ వీడియోలో భాగంగా వైయస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందని, ఎక్కడా కూడా ఈమె కాంగ్రెస్ పేరు పలకలేదు అలా పలకడానికి కూడా ఇష్టపడలేదని తెలుస్తోంది. అంతేకాకుండా షర్మిలను గెలిపించాలని చెప్పారే తప్ప వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎక్కడా కోరలేదు.
కాంగ్రెస్ పేరు కూడా పలకలేదు…
ఇక ఈ వీడియోలో భాగంగా విజయమ్మ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఎక్కడ పలకలేదు. దీన్ని బట్టి చూస్తేనే ఈమె తన కొడుకుకు మద్దతు తెలుపుతున్నారని, తన కొడుకు అంటేనే విజయమ్మకు ప్రేమ ఉందని తెలుస్తుంది అలాకాకుండా పూర్తిగా తన కూతురికే మద్దతు తెలిపేలాగా ఉంటే ఈమె తన కొడుకు పై విమర్శలు చేసేది కానీ ఎక్కడ కూడా జగన్ పేరును కూడా విజయమ్మ ప్రస్తావించకపోవడం తన కొడుకు పై తనకు ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనమని చెప్పాలి.





























