Ap politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ బస్సు యాత్ర అద్భుతమైనటువంటి విజయం అందుకోవడంతో అది చూసి తట్టుకోలేనటువంటి ప్రతిపక్ష నేతలు ఈ దాడి చేయించారంటూ వైసిపి నేతలు కార్యకర్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరిగిందంటే ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఖండించాలి.అయితే టీడీపీ నాయకులు దాడిని ఖండించకుండా ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పట్ల జరిగినటువంటి ఈ భౌతిక దాడి కంటే ఆయన పట్ల ఆయన స్థాయిని దిగజార్చి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి కామెంట్లు ఎంతో బాధ కలిగిస్తున్నాయని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి వారు ఈ ఘటనపై స్పందించి విచారం వ్యక్తం చేయగా చాలా ఆలస్యంగా చంద్రబాబు నాయుడు స్పందించడంతోనే ఆయన మనసులోని భావాలు ఏంటో అర్థం అవుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి పట్ల రాజకీయంగా ఎదుర్కోవడంలో విఫలమైనటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి దాడులకు పాల్పడ్డారని ఆయనకు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెబుతారని సోషల్ మీడియా వేదికగా వైసిపి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
గత ఫలితాలే రిపీట్ అవుతాయి..
చంద్రబాబు నాయుడు జైలులో ఉంటే ఆయనపై హత్య ప్రయత్నాలు చేస్తున్నారంటూ తన ఎల్లో మీడియాతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయించారు అయితే ఇప్పుడు కళ్ళముందే రక్తం కారుతూ ఉన్నా డ్రామాలు అంటూ తన పచ్చ మీడియాతో చెత్త రాతలు రాయిస్తున్నారని, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఆయన రాజకీయ పతనానికి కారణం అవుతాయని 2019లో వచ్చిన ఫలితాలు ఇప్పుడు కూడా రిపీట్ అవ్వబోతాయి అంటూ వైసిపి అభిమానులు హెచ్చరిస్తూ చేస్తున్నటువంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి.





























