Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు తన స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మాత్రం స్వయంగా ప్రచార కార్యక్రమానికి వెళ్లి మద్దతు తెలియజేశారు దీంతో అల్లు అర్జున్ పై భారీ స్థాయిలో ట్రోల్స్ జరుగుతున్నాయి.

తన కుటుంబ సభ్యులు తన మామయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేయకుండా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ పై విమర్శలు కురిపిస్తున్నారు అయితే నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇలా తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ తాను నంద్యాలలో ప్రచార కార్యక్రమాలు చేయడం స్నేహంతోనే చేశానని నాకు పార్టీలతో సంబంధం లేదని తెలిపారు. నా మనసుకు నచ్చితే నా మామయ్య పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతాను అలాగే నా స్నేహితుడికి తెలియజేస్తాను ఇక నా మామయ్య చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు బన్నీ వాసు కావచ్చు ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తానని తెలిపారు.
రాజకీయాలలో రాను..
రవితో నాకు 15 సంవత్సరాలుగా పరిచయం ఉంది. తాను ఎన్నికలలో పోటీ చేస్తే డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చాను 2019 సంవత్సరంలో అది కుదరలేదు. అందుకే ఈసారి తన భార్యతో కలిసి వెళ్లి తనకు మద్దతు తెలిపారని వెల్లడించారు. ఇక నాకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని తెలిపారు. ఇక మీరు రాజకీయాలలోకి రాబోతున్నారు అనే ప్రశ్న కూడా ఎదురు కావడంతో తనకు రాజకీయాలలోకి వచ్చే ఆలోచన ఏమాత్రం లేదని తెలిపిన అల్లు అర్జున్ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.



























