పక్కా ప్లాన్ తో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్న.. అల్లు అర్జున్ సోదరి?

0
1992

యూట్యూబ్ వెబ్ సిరీస్ లను తరచూ ఫాలో అయ్యే వారికి వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టిక్ టాక్ వీడియోలు, పలు షార్ట్ ఫిలిమ్స్,వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వైష్ణవి చైతన్యకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వెండితెరపై పలు అవకాశాలను దక్కించుకున్నారు.

ఇప్పటివరకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీని సంపాదించుకున్న చాలామంది వెండితెరపై కూడా తమ హవాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య కూడా వెండితెరపై హీరోయిన్ గా సందడి చేయడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే వెండితెరపై పలు పాత్రలో నటించి అందరిని మెప్పించారు.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న “అలా వైకుంఠపురం” సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే ఈమెకు వెండితెరపై మరిన్ని అవకాశాలు వెల్లువెత్తాయి. వైష్ణవి చైతన్య నటించిన “సాఫ్ట్ వేర్ డెవలపర్”అని వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

“సాఫ్ట్ వేర్ డెవలపర్” వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడటంతో ఈమెకు వెండితెరపై హీరోయిన్ గా నటించే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ త్వరలోనే వెండితెరపై సందడి చేయనున్నారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here