Barelakka: బర్రెలక్క పరిచయం అవసరం లేని పేరు ఈమె సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను చేస్తూ ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా గత ఎన్నికలలో భాగంగా తెలంగాణ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరింత పాపులర్ అయ్యారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలలో కూడా పోటీకి దిగారు.

ఇలా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలైనటువంటి ఈమె వెంకటేష్ అనే వ్యక్తిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన భర్త సహాయంతో ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు అయితే ఇటీవల బర్రెలక్కపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో నెగటివ్ ట్రోల్స్ రావడం మొదలయ్యాయి.
ఈ విధంగా ఈమె గురించి నెగిటివ్ కామెంట్లు రావడంతో తన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడ్డారు అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో నా గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ చూస్తుంటే నేను మరో గీతాంజలి అవుతానేమోనని భయం వేస్తుందని తెలిపారు. ఆ ట్రోల్స్ చూసిన కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్నారని తెలిపారు.
దయచేసి ట్రోల్ చేయొద్దు..
మీకు నాపై కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టండి కానీ దయచేసి ఎవరూ కూడా ఇలాంటి కామెంట్లు చేయొద్దని ఈమె తెలిపారు. ఆ కామెంట్లు చూసి నేను కూడా ఎక్కడ చనిపోతానేమోనని బాధ భయం నాలో కలుగుతున్నాయని తెలిపారు. ఇక నేను ఎంపీ ఎన్నికలలో పోటీ చేయడమే తప్పు అయితే ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నేను పూర్తిగా సోషల్ మీడియాకి అలాగే రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఇలా ట్రోల్స్ కారణంగా ఈమె ఇబ్బంది పడుతున్నానంటూ ఎమోషనల్ అవుతూ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.



























