Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో కార్తీకదీపం విలన్ మోనిత… ఈమె రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

0
128

Bigg Boss 7: బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఇక తెలుగులో ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా పలువురు కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లలో కార్తీకదీపం విలన్ కూడా ఉన్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా బిగ్ బాస్ రివ్యూయర్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

ఇలా కార్తీకదీపం సీరియల్ లో మోనిత పాత్రలో నటించినటువంటి నటి శోభా శెట్టి ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ఈసారి తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందని తెలుస్తోంది.

Bigg Boss 7:లక్షల్లో రెమ్యూనరేషన్…

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం శోభ శెట్టి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈమె ఒక వారం రోజులపాటు హౌస్ లో కొనసాగడం కోసం ఏకంగా 1.25 లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.