Kareena Kapoor: ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ సినిమాలని మాత్రమే చెప్పుకునేవారు.అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలలో పెద్ద పెద్ద డైరెక్టర్లు హీరో హీరోయిన్లు కోట్ల కొద్ది డబ్బులు ఖర్చు చేసి భారీ సినిమాలను చేసేవారు. అయితే ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. చిన్న చిన్న సినిమాలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడంతో బాలీవుడ్ కింగ్స్ అని చెప్పుకునే కొందరి హీరోల కెరియర్ పూర్తిగా డౌన్ ఫాల్ అవుతుందని చెప్పాలి.

తాజాగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కరీనాకపూర్ కలిసి నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఇందుకు నిదర్శనం అని చెప్పాలి . ఈ సినిమా ప్రముఖ హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది.దీంతో స్వయంగా నటి కరీనాకపూర్ రంగంలోకి దిగి ఈ సినిమా గురించి కొందరు ఉద్దేశపూర్వకంగానే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అయితే వాటిని నమ్మకండి ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చే సినిమా చూడండి అంటూ వేడుకున్నారు.
ఈ సినిమా కోసం సుమారు 250 మంది మూడు సంవత్సరాలు పాటు కష్టపడి సినిమా చేసాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కరీనాకపూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఘాటుగా స్పందించారు.మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా ఎంతో టాలెంట్ ఉన్నవాళ్లు ఇండస్ట్రీలోకి వస్తే వారికి అవకాశాలు లేకుండా తొక్కేసినప్పుడు ఈ నొప్పి ఏమైంది కరీనాకపూర్ అని ప్రశ్నించారు.

Kareena Kapoor: చిన్న సినిమాలకు థియేటర్స్ లేకుండా చేశారు….
ఆ సమయంలో లేని నొప్పి ఇప్పుడు కలిగిందా..కొందరు బాలీవుడ్ కింగ్స్ అనే చెప్పుకొని నటీనటులు డైరెక్టర్లు కొత్త వారిని ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఇలా ఆ సమయంలో మౌనంగా ఉన్నారే తప్ప ఎవరు ప్రశ్నించలేదు అయితే ఇప్పుడు అలా జరిగే ప్రసక్తే ఉండదు ఎందుకంటే చిన్న సినిమాలను కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటూ వివేక అగ్నిహోత్రి కరీనాకపూర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.































