Karthik Varma Dandu: విరూపాక్ష సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడైన కార్తీక్ దర్శకత్వంలో సాయి ధరంతేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమా ఇటీవల విడుదలై అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఘనవిజయం సాధించింది.
తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కొల్లగొట్టడమే కాకుండా జోరు కొనసాగిస్తోంది. హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టడంలో బాగా సక్సెస్ అయ్యి హిట్ అందుకుంది. ఇదిలా ఉండగా కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో నిర్మాతలు ఆయనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందించారు.
సాధారణంగా సినిమా హిట్ అయ్యి మంచి వసూళ్లు రాబడితే నిర్మాతలు ఆ సినిమా దర్శకులకు ఏదో ఒక ఖరీదైన బహుమతిని అందజేస్తూ ఉంటారు. విరూపాక్ష సినిమా విషయంలో కూడా అదే జరగడం వల్ల ఆ సినిమా నిర్మాతలు దర్శకుడు కార్తీక్ కి ఒక గిఫ్ట్ అందజేశారు. విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రూ. 100 కోట్లు వసూళ్లు చేయడంతో దర్శకుడు కార్తీక్ కి నిర్మాతలు ఖరీదైన బెంజ్ కారుని బహుమతిగా అందజేశారు.
ప్రస్తుతం ఆకారుకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను బట్టి చూస్తే నిర్మాతలు బెంజ్ సీ మోడల్ కారుని దర్శకుడికి బహుకరించినట్లు తెలుస్తోంది. దీని విలువ దాదాపు రూ . 60 నుండి రూ. 70 లక్షల వరకు ఉంటుంది. ఏది ఏమైనా ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయిన కార్తీక్ కు నిర్మాతలు ఒక ఖరీదైన కారుని బహుమతిగా అందజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…