Categories: FeaturedMovie News

దీపను చంపేసి.. మనం పెళ్లి చేసుకుందాం కార్తీక్.. మోనిత మరో రాక్షస ప్లాన్!

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం బాగా ఆసక్తిగా మారింది. మళ్లీ మోనిత కనిపించడంతో ఇంకా మోనిత బతికే ఉందని.. మళ్లీ ఎటువంటి ప్రమాదాలు తీసుకు వస్తుందో అని ప్రేక్షకులు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు.

ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం.. మొత్తానికి రత్న సీత మోనిత మనిషేనని అందరికీ అర్థమైంది. కార్తీక్ ఫోటో చూసి మోనిత ఎంత పిచ్చిగా ప్రవర్తించిందో చూసాం. కార్తీక్ ను వదలను అంటూ గట్టిగా అరిచింది. హిమ, శౌర్య దీప కింద పడుకోవడంతో ఏడుస్తూ ఎందుకు పడుకున్నావని అంటారు.

ఇక పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పక జైల్లో ఉన్న కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. ఇక పిల్లలు తన తండ్రిని చూడటానికి తన తల్లిని కోరుకుంటారు. దీప మాత్రం వద్దు అని అంటుంది. ఆయన పిల్లలు వినకుండా మారం చేస్తారు. ఇక దీప అలాగే ఆలోచిస్తూ ఉంటుంది.

మరోవైపు సౌందర్య ఇల్లును అదేపనిగా చూడటంతో ఆదిత్య ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తాడు. దాంతో కళ తప్పినట్లుగా ఉందని.. మీ అన్నా ఇంట్లో లేడని అందుకే ఇలా ఉంది అని మాట్లాడుకుంటారు. అలా కార్తీక్ గురించి బాగా ఎమోషన్ గా మాట్లాడుతుంది.

దీప గురించి మాట్లాడుతూ.. తనకి ఈ బాధ అంతా పరిచయమే ఉంది కాబట్టి తనకు అలవాటు అయిందని అంటుంది. కార్తీక్ మోనితను చంపాడని నమ్మలేకపోతునానని.. కాని సాక్ష్యాలు చూసి నమ్మాల్సి వస్తుంది అని ఏడుస్తుంది.

ఇక మోనిత.. కార్తీక్ ఫోటోను చూసుకుంటూ.. నీ జీవితంలోకి అడుగు పెట్టాలని ఎంతగానో ఎదురు చూశాను అంటూ.. కానీ ఇలా ఉన్నాను అంటూ.. అందుకు నీపై ప్రేమ అని అంటుంది. ఇదంతా నీ కోసమే చేశాను అంటూ.. జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో నాకు లేదని అంటుంది.

దీపను కార్తీక్ ను దూరం చేయాలని అనుకుంటుంది.తను చనిపోయినట్లు నాటకం చేస్తే అలా కార్తీక్ జైల్లో ఉండటం వల్ల కొన్ని రోజులైనా దీప, కార్తీక్ లు దూరంగా ఉంటారు అనే ఉద్దేశంతో అలా చేశానని అనుకుంటుంది. ఇక తనకు శిక్ష పడే లోపు వచ్చేస్తాను అనుకుంటుంది.

అంతలోపే పిల్లలు తప్ప దీపను, అందరినీ చంపేస్తానంటూ గట్టిగా అరుస్తుంది.నిన్ను చూడాలని ఉంది అంటూ.. కానీ అంతలోపే ఆ కనుబొమ్మలు పైకి ఎత్తే దానిని పైకి పంపిస్తాను అంటూ దీపం ఉద్దేశించి మాట్లాడుతుంది.

ఇక దీప పిల్లలతో రావడాన్ని చూసి.. సౌందర్య గుడికా అని అడుగుతుంది. దేవుడి దగ్గరికి అనడంతో.. డాడీ దగ్గరికి వెళ్తున్నాం అని హిమ అంటుంది. సౌందర్య పైకి వెళ్ళి తాతకు చెప్పండి అని అనగా వెంటనే హిమ పైకి వెళుతుంది.

అది చూసిన సౌర్య ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని కాసేపు హిమతో మాట్లాడుతుంది. నానమ్మ అమ్మతో ఏదో చెప్పాలని అనుకుంటుంది అందుకే.. మనల్ని పక్కకు పంపిస్తున్నారు అని అంటుంది. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్లడం ఏంటి.. బయటికి వెళదామని అంటుంది సౌర్య.

సౌర్య మాటలు విని సౌందర్య షాక్ అవుతూ దీపతో వారి తెలివి గురించి మాట్లాడుతుంది.ఇక వాళ్లకు మోనిత చనిపోయిన విషయం తెలియదని.. పోలీస్ స్టేషన్ లో ఎవరైనా ఆ మాట అంటే ఆ పిల్లలు ఎలా తట్టుకుంటారు అని ప్రశ్నిస్తుంది. పిల్లలకు ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడమని సలహా ఇస్తుంది.

మోనిత.. కార్తీక మాటలను తలచుకుని గతాన్ని గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ తో తాను చివరిగా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. దీప ఏమైతే మనకేంటి అనడంతో.. కార్తీక్ మోనితపై అరిచి అక్కడనుంచి వెళ్లడం.. తర్వాత గన్ తో షూట్ చేసుకోవడం వంటి సీన్ ను చూపిస్తారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago