Movie News

Karthika Deepam: గురితప్పని మోనిత గన్ షాట్.. వంటలక్క చచ్చిపోయిందా?

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ సామాన్యులకే కాకుండా సెలబ్రిటీలకు కూడా అభిమాన సీరియల్ గా మారింది. చనిపోయిందనుకున్న మోనిత మళ్లీ తిరిగి రావడం మళ్లీ తన పగని పెంచుకోవడంతో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులకు టెన్షన్ గా మారింది.

ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. రోషిణి.. కార్తీక్ తో మోనిత గురించి ఆవేశంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. కార్తీక్ మాత్రం తన నిజాయితీని బయట పెట్టిన కూడా రోషిణి మాత్రం కార్తీక్ మాటలు నమ్మలేకపోతుంది. శవాన్ని ఎక్కడ దాచావో చెప్పు అంటూ తన మాటలతో కార్తీక్ పై బాగా ఫైర్ అవుతుంది.

ఇక దుర్గ దగ్గరకు దీప, వారణాసి, అంజి వెళ్లి మాట్లాడుతారు. అంజి ప్రశ్నలకు దుర్గ సమాధానాలు చెబుతూ ఉంటాడు. ఇక దీప జరిగిన విషయాన్ని మొత్తం దుర్గా కి చెబుతుంది. ఇదంతా డాక్టర్ బాబు చేశాడని నింద వేశారు అని తెలుపుతుంది.

డాక్టర్ బాబు అంత పని చేయలేదు అని దుర్గా గట్టిగా చెబుతాడు. ఇక మోనితను వెతికితే అంత బయటపడుతుంది అని దుర్గా అంటాడు. దుర్గ, అంజి లను చూసి ధైర్యం చాలు అనుకుంటుంది దీప.

ఇక మరోవైపు మోనిత, రత్న సీత భోజనం చేస్తూ కనిపిస్తారు. ఇక ఈ రోజు కార్తీక్ కోసం ఎవరు వచ్చారు అని మోనిత అడుగుతుంది. ఎవ్వరు రాలేదని ఇవాళ కార్తీక్ ని మేడమ్ ఇంటరాగేషన్ చేసింది అని చెబుతుంది.

రత్న సీత.. తన అక్క ప్రాణాలు కాపాడినందుకు ఇలా కృతజ్ఞత భావనలతో ఇలా చట్టవ్యతిరేకంగా సహాయం చేస్తున్నాను అని మోనితతో అంటుంది. రేపు ఏదైనా అయితే మీరే బాధ్యత అన్నట్లు మాట్లాడుతుంది రత్న సీత.

అన్నీ ఉన్నా కూడా నేను కార్తీక్ కోసం ఈ రోజు ఏమీ లేని దానిలా ఉన్నాను అంటూ.. ఇదంతా కార్తీక్ పై ఉన్న ప్రేమ అని అంటుంది. కార్తీక్ కోసం అన్ని త్యాగం చేశాను కాబట్టి.. నువ్వు కూడా నా కోసం ఆలోచించు అంటూ.. సహకరించు అంటూ.. నీకు నేను ఉన్న అంటూ రత్న సీతకు ధైర్యాన్ని ఇస్తుంది.

మురళి కృష్ణ, భాగ్యం వచ్చి దీపను పలకరించగా సౌర్య కాస్త వెటకారంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. భాగ్యం కాసేపు పిల్లలతో సరదాగా మాట్లాడుతుంది. ఇక పిల్లలు లేనప్పుడు దీపకు గుడిలో జరిగిన విషయాన్ని చెబుతుంది భాగ్యం.

రోషిణి.. సౌందర్య దగ్గరికి వచ్చిమళ్లీ మాటల యుద్ధం చేస్తుంది. అక్కడ మీ కొడుకు హత్య చేయలేదని అంటున్నాడు అని అనడంతో సౌందర్య.. కార్తీక హత్య చేయలేదన్న విషయాన్ని అనడంతో షాక్ అవుతుంది.

మోనితను కార్తీక్ హత్య చేయలేదని సౌందర్య కూడా నమ్ముతుంది. రోషిణి మాత్రం తన పంతాన్ని వదలకుండా మాట్లాడుతుంది. సౌందర్య కూడా కార్తీక్ నిర్దోషి అన్నట్లు మాట్లాడుతుంది. అలా వారి ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతోంది.

ఇక గుడిలో దీప కోసం పూజ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూజారి దీపతో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వచ్చిన మోనిత సోదమ్మ గెటప్ లో గన్ పట్టుకొని షూట్ చేసినట్లు కనిపిస్తుంది. దీపా వెంటనే కింద పడబోతున్నట్లు కనిపిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago