General News

ఒక్కసారి ప్రీమియం చెల్లించండి.. నెలకు రూ.7, 000 పొందండి..!

ఎల్ఐసీ వివిధ వర్గాల వారికి ప్రత్యేకమైన పాలసీలను తీసుకొస్తోంది. అందులో భాగంగానే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ కూడా ప్రవేశపెట్టింది. దీనిలో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు ప్రతీ నెల అకౌంట్ లో డబ్బుల పొందొచ్చు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గతేడాది ‘న్యూ జీవన్ శాంతి’ పాలసీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సింగిల్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ పాలసీ. ఈ పాలసీలో ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి మాత్రమే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రతీ నెల డబ్బులు మన అకౌంట్లోకి వస్తాయి. అందుకే సింగిల్ ప్రీమియం పాలసీ అన్నారు.

దీనిలో కనీసం రూ.1.50 లక్షలు చెల్లించాలి. దీనికి గరిష్టంగా ఇంత కట్టాలి అనే రూల్ లేదు. ఎంతైనా ప్రీమియం కొట్టొచ్చు. కనీస వయస్సు మాత్రం 30 ఏళ్లు నిండి.. గరిష్టంగా 79 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఇలా చెల్లించిన వారికి నెలకు రూ.1000 చొప్పును యాన్యూటీ లభిస్తుంది. ఈ పాలసీ తీసుకునే సమయంలో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో మెచ్యూరిటీ తీరినప్పుడు కూడా అలానే ఉంటాయి.

ఎల్ఐసీ ఏజెంట్ దగ్గర కానీ.. లేదా ఆన్ లైన్ లో కానీ ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో సింగిల్ ప్రీమియం చెల్లించిన తర్వాత అవసరమైనప్పుడు లోన్ కూడా తీసుకోవచ్చు. ఓ వ్యక్తి ఈ పాలసీని రూ.10 లక్షలతో తీసుకుంటే.. అతడికి నెలకు రూ.7,952 డబ్బులు వస్తాయి. డిఫర్‌మెంట్ పీరియడ్ 12 ఏళ్లు ఎంచుకున్నప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. అంటే ఏడాదికి రూ.99,400 లభిస్తాయి. అయితే వాటికి వడ్డీ అనేది అదనంగా జమ అవుతూ ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago